IND Vs ENG Test | ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఐదోరోజు రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు వస్తాడని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో క్రిస్ వోక్స్ వేసిన యార్కర్‌ను రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో పంత్ పాదానికి గాయమైంది. బంతి లోపలి అంచుకు వెళ్లి షూ ముందుభాగంలో తాకింది. తీవ్రమైన నొప్పితో బాధపడ్డ పంత్ ఆ తర్వాత ఫిజియోను సంప్రదించాడు. చివరకు మైదానాన్ని వీడాడు. కుడి పాదం వాచిపోయి రక్తస్రావమైంది. స్కానింగ్‌లో ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. ఆరువారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో ఫ్రాక్చర్ ఉన్నా పంత్ బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ చేశాడు. అయితే, బొనటవేలు గాయానికి చికిత్స తీసుకునే ముందు మ్యాచ్ ఫలితం వరకు వేచి ఉండాలని నిర్ణయించుకున్నట్లు సితాన్షు కొటక్ తెలిపాడు.
ఇంగ్లండ్ విధించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సున్నా స్కోర్‌కే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ జోడీని బ్యాటింగ్ కోచ్ ప్రశంసించాడు. బ్యాటింగ్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. రాహుల్ సిరీస్ అంతటా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని తెలిపాడు. సునీల్ గవాస్కర్ (542 పరుగులు) రికార్డు చేరువయ్యాడు. 1979లో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో 500 కంటే ఎక్కువ (508) పరుగులు చేసిన రెండో ఆసియా ఓపెనర్‌గా రాహుల్ నిలిచాడు. బ్యాటింగ్ సమయంలో జో రూట్ వేసిన గుడ్లెన్త్ డెలివరీ మోకాలికి తగలడంతో రాహుల్ నొప్పితో తడబడ్డాడు. కానీ, ఫిజియోని అనుమతించలేదు. అది అంపైర్ నిర్ణయం కాదని.. ఆటగాడికి గాయమైనప్పుడు అంపైర్ ఫిజియోను ఆపలేడని.. కానీ రాహుల్ కోరుకోకపోవచ్చని సుధాన్షు పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా.. నాలుగో టెస్ట్ నాలుగో రోజు టీమిండియా కష్టాల్లో ఉన్నది. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడ్డ భారత్‌ను కేఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్ జోడీ ఆదుకుంది. అజేయంగా 174 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 174 పరుగులు చేసింది. ఇంకా ఇంగ్లండ్ కంటే టీమిండియా 137 పరుగులు వెనుకబడి ఉన్నది. ఐదో రోజు ఈ జోడీ ఎంత వరకు నిలబడుతుందో వేచి చూడాల్సిందే. బ్యాట్స్‌మెన్ రాణిస్తేనే ఈ మ్యాచ్‌ను టీమిండియా డ్రా చేసే అవకాశం ఉంటుంది. గాయపడ్డ పంత్ సైతం బ్యాటింగ్ అందుబాటులో ఉండడం జట్టుకు కలిసిరానున్నది.