IND vs ENG 3rd Test | రాజ్‌కోట్ టెస్టులో అరంగేట్రం చేసి తొలి మ్యాచ్‌లోనే 48 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి దూకుడుగా ఆడిన సర్ఫరాజ్ ఖాన్ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా రోహిత్ శర్మ నిష్క్రమించాక వచ్చిన సర్ఫరాజ్.. 66 బంతుల్లో 9 బౌండరీలు, 1 సిక్సర్ సాయంతో 62 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడుతున్న సర్ఫరాజ్.. రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు. సర్ఫరాజ్ రనౌట్ అయిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌లో సారథి రోహిత్ శర్మ.. ఆగ్రహంతో ఊగిపోయాడు. జడేజా చేసిన పనితో తల మీద ఉన్న క్యాప్‌ను కోపంతో నేలకేసి కొట్టాడు.
జడేజా 99 పరుగుల వద్ద ఉండగా అండర్సన్ వేసిన 82వ ఓవర్లో ఐదో బంతిని మిడాన్ దిశగా ఆడాడు. పరుగు తీసేందుకు జడేజా ముందుకు కదిలాడు. సర్ఫరాజ్ కూడా కాస్త వేగంగానే నాన్ స్ట్రయికర్ ఎండ్ నుంచి దాదాపు సగం పిచ్ దాకా వచ్చాడు. కానీ మిడాన్‌లో బంతిని అందుకున్న మార్క్ వుడ్.. మెరుపు వేగంతో నాన్ స్ట్రయికర్ వైపున ఉన్న వికెట్లను పడగొట్టాడు.
Rohit sharma was not happy with Jadeja…. #INDvsENGTest #INDvENG #SarfarazKhan pic.twitter.com/IixlTG3e7Q
— SadhuWeatherman (@abhiramsirapar2) February 15, 2024
సర్ఫరాజ్ ఔట్ అయిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి చూస్తున్న రోహిత్.. కోపంతో క్యాప్‌ను నేలమీదకు బలంగా విసిరేశాడు. ‘ఎంత పనిచేశావ్ జడేజా.. చూసుకోవాలిగా..’ అన్నట్టుగా రియాక్షన్ ఇచ్చాడు. సర్ఫరాజ్ అక్కడ్నుంచి బాధతో వెళ్లి పెవిలియన్ వద్ద నిరాశగా కూర్చున్నాడు. జడేజా కూడా అదే బాధతో అదే ఓవర్లో మరుసటి బంతికే సెంచరీ చేసినా దానిని సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు.
Jadeja was so selfish 🙄 🤔👀
Your thoughts on this run-out of #SarfarazKhan 🤔#INDvENG #INDvsENGTest #RohitSharma#Jadejapic.twitter.com/brhecR1UqW
— Fourth Umpire (@UmpireFourth) February 15, 2024
జడేజా వల్లే సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ అవడంతో ట్విటర్ (ఎక్స్)లో #Selfish హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. జడేజా సెంచరీ కోసం ఆలోచించే సర్ఫరాజ్‌ను బలిచేశాడని నెటిజన్లు వాపోతున్నారు. తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్ ఇలా ఔట్ కాకపోయి ఉండుంటే అతడు కూడా సెంచరీ చేసుకునేవాడని అభిప్రాయపడుతున్నారు.