IND vs ENG 2nd Test: విశాఖపట్నం వేదికగా భారత్‌తో ముగిసిన రెండో టెస్టులో భాగంగా ఆట మూడో రోజు విలేకరులతో మాట్లాడుతూ.. తమకు ఈ టార్గెట్ ఓ లెక్కే కాదని, 60-70 ఓవర్లలోనే దంచిపడేస్తామని ఇంగ్లీష్ పేసర్ జేమ్స్ అండర్సన్ అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే ఫలితం మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చింది. దూకుడుగా బజ్‌బాల్ ఆడబోయిన ఇంగ్లండ్.. 292 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్‌ను భారత్.. 69.2 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు, నెటిజన్లు అండర్సన్‌ను సోషల్ మీడియా వేదికగా ఆటాడుకుంటున్నారు.
భారత్.. ఇంగ్లండ్ ఎదుట 399 పరుగులను నిర్దేశించగా మూడోరోజు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన పర్యాటక జట్టు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 67 పరుగులు చేసింది. దీంతో నాలుగో రోజు ఆ జట్టు
మూడో సెషన్ కంటే ముందే మిగిలిన 332 పరుగులను దంచికొడ్తుందని అండర్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అండర్సన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ గేమ్‌లో మేం మెరుగైన స్థితిలోనే ఉన్నాం. నిన్న రాత్రి మేం కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్తో సమావేశమైనప్పుడు అతడు మాతో.. ‘ఒకవేళ ఇండియా 600 టార్గెట్
పెట్టినా మనం ఛేదించాలి’ అని చెప్పాడు. ఈ టెస్టులో ఇంకా రెండు రోజుల ఆట మిగిలుంది. అంటే 180 ఓవర్లున్నాయి. కానీ మేం మాత్రం 60-70 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదిస్తాం..’ అని అన్నాడు.
#TeamIndia completed the task inside 70 overs 😉#INDvENG pic.twitter.com/U0icdMbaU3
— Punjab Kings (@PunjabKingsIPL) February 5, 2024
అండర్సన్ చెప్పినంత దూకుడుగా ఆడకపోయినా ఇంగ్లండ్ బాగానే పోరాడింది. కానీ కీలక సమయంలో భాగస్వామ్యాలు నెలకొల్పలేక, వికెట్లు కోల్పోయి తంటాలుపడింది. ఆ జట్టు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు
జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ లు 30 పరుగుల స్కోరు కూడా చేయలేదు. జాక్ క్రాలే (73) ఒక్కడే కాస్త బెటర్‌గా ఆడాడు. ఆఖర్లో బెన్ ఫోక్స్ (36), టామ్ హర్ట్లీ (36)లు ఫర్వాలేదనిపించారు.
James Anderson “ we can chase this score in 60 or 70 overs”
Bumrah and Ashwin right now 🤣🤣#INDvsENG #INDvENG #ENGvIND
pic.twitter.com/qPNrMm4mNw— Secular Chad (@SachabhartiyaRW) February 5, 2024
Rohit sharma to James Anderson after the match . https://t.co/B7ddbvCjMp pic.twitter.com/3AGAeGJZny
— Hunटरर ♂ (@nickhunterr) February 5, 2024
ఆఖరికి ఇంగ్లండ్.. 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌట్ అయింది. జేమ్స్ అండర్సన్ ఐదు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత్ మ్యాచ్ గెలిచిన తర్వాత నెటిజన్లు.. అండర్సన్ నిన్న చేసిన కామెంట్స్‌ను జత చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు.