BAN vs IND | బంగ్లాతో రెండో టెస్టు.. ఆట ముగిసే సరికి భారత్ 19/0
ఉమేశ్, అశ్విన్‌కు నాలుగేసి వికెట్లు
BAN vs IND : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. పేసర్లు ఉమేశ్ యాదవ్, అశ్విన్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో బంగ్లా మొదటి రోజే 227 పరుగులకే ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (3), శుభ్‌మన్ గిల్ (14) క్రీజులో ఉన్నారు. ఇండియా ఇంకా 208 పరుగులు వెనకబడి ఉంది. రెండో రోజు ఓపెనర్లు భారీ స్కోర్ సాధిస్తే, భారత్ మ్యాచ్‌పై పట్టు బిగించే అవకాశం ఉంది. మొదటిటెస్టులో గెలిచిన టీమిండియా ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది.
రెండో టెస్ట్‌లో విజయంపై కన్నేసిన భారత్‌కు బౌలర్లు శుభారంభం ఇచ్చారు. 213 వద్ద 5 వికెట్లతో ఉన్న బంగ్లా సీనియర్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ విజృంభించడంతో 227 పరుగులకే ఆలౌట్ అయింది. ఉమేశ్ వికెట్ టు వికెట్ బౌలింగ్‌తో బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టి వికెట్లు రాబట్టాడు. టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బంగ్లా ఓపెనర్ జకిర్ను అవుట్ చేసి అతను టెస్టుల్లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. బంగ్లా బ్యాటర్లలో మొమినుల్ ఒక్కడే హక్ హాఫ్ సెంచరీ (84)తో రాణించాడు. సెంచరీకి చేరువైన అతడిని అశ్విన్ బోల్తా కొట్టించాడు. ముష్ఫికర్ రహీం 26 పరుగులతో సెకండ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లిట్టన్ దాస్ (25), కెప్టెన్ షకిబుల్ హసన్ (16) నిరాశ పరిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

