Jasprit Bumrah | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభమైంది. గబ్బా టెస్ట్‌లో తొలిరోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే, గబ్బా పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, గబ్బా పిచ్ ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా అనుకూలించలేదు. టీమిండియా బౌలర్లు 13.2 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ తీయలేకపోయారు. బ్రిస్బేన్‌లో ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు పిచ్‌పై గడ్డి ఉండడంతో వికెట్‌కు అనుకూలంగా ఉంటుందని భావించారు.
అయితే, బుమ్రా, సిరాజ్ విసిరిన బంతులు ఏమాత్రం స్వింగ్ కాకపోవడంతో బౌలర్లు కాస్త నిరాశకు గురయ్యారు. బంతి స్వింగ్ అవడం లేదని బుమ్రా చెప్పిన మాటలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. మూడో టెస్ట్‌లో తొలిరోజు ఆటముగిసే సరికి 13.2 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 19 పరుగులతో, నాథన్ మెక్‌స్వీనీ నాలుగు పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. తొలిరోజు వర్షం అంతరాయం కలగడంతో రెండోరోజు ఆదివారం 98 ఓవర్లు వేయనున్నారు. మ్యాచ్ నిర్ణీత సమయానికంటే అరగంటే ముందే మొదలుకానున్నది. రెండో రోజు మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 5.20 ప్రారంభం కానున్నాయి.
Bumrah: “Nahi ho raha hai swing, kahi bhi kar” – We should’ve batted after winning the toss? pic.twitter.com/lYXiiSqSuQ
— Mihir Jha (@MihirkJha) December 14, 2024