ఏంటా బౌలింగ్? మ్యాచ్ చివర్లో తొలి ఓవర్ వేయడానికి వచ్చిన షమీని చూసి అభిమానుల మదిలో మెదిలిన ప్రశ్న అదే. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో షమీ అద్భుతమే చేశాడు. చివరి ఓవర్లో 11 పరుగులు కాపాడుకోవాల్సిన తరుణంలో.. ఎవరూ ఊహించని విధంగా మహమ్మద్ షమీకి బంతిని అందించాడు రోహిత్.
అప్పటి వరకు మ్యాచ్‌లో లేని షమీ.. ఆ ఓవర్లో అద్భుతమే చేశాడు. తొలి రెండు బంతులకు నాలుగు పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి కమిన్స్ సిక్సర్ బాదేందుకు చూశాడు. అయితే లాంగాన్‌లో ఉన్న కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌తో అతన్ని పెవిలియన్ చేర్చాడు. సింగిల్ హ్యాండ్‌తో కోహ్లీ అందుకున్న క్యాచ్ చూసి అంతా ఆశ్చర్యపోయారు.
ఆ మరుసటి బంతికి స్పెషలిస్ట్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (1)కు స్ట్రైకింగ్ ఇచ్చేందుకు ఆష్టన్ అగర్ (0) తన వికెట్ త్యాగం చేశాడు. అతన్ని రనౌట్ చేసిన షమీ.. ఆ తర్వాత వేసిన అద్భుతమైన యార్కర్‌కు ఇంగ్లిస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో వచ్చిన కేన్ రిచర్డ్సన్ను కూడా సూపర్ యార్కర్‌తో అవుట్ చేశాడు షమీ. దీంతో 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు.. 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టు ఆరు పరుగుల తేడాతో తొలి వార్మప్ మ్యాచ్‌లో విజయం సాధించింది.
ఆసీస్ జట్టు చివరి 6 వికెట్లను కేవలం 9 పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 186/7 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (79), మిచెల్ మార్ష్ (35) ఆ జట్టుకు అదిరే ఆరంభం అందించారు.
తర్వాత మ్యాక్స్‌వెల్ (23) కూడా రాణించగా.. స్టీవ్ స్మిత్ (11), స్టొయినిస్ (7), టిమ్ డేవిడ్ (5), జోష్ ఇంగ్లిస్ (1), పాట్ కమిన్స్ (7), ఆష్టన్ అగర్ (0), కేన్ రిచర్డ్సన్ (0), మిచెల్ స్టార్క్ (0 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ఆ జట్టు 180 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ఒక్క ఓవర్ మాత్రమే వేసిన షమీ 3 వికెట్లతో చెలరేగాడు. భువనేశ్వర్ 2 వికెట్లతో సత్తా చాటగా.. అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.
🏏🇮🇳 VICTORY IS OURS! Shami announced his arrival with an outstanding final over to help us get the W.
👏 Top work from everyone today!
📸 Getty • #INDvAUS #AUSvIND #T20WorldCup #TeamIndia #BharatArmy pic.twitter.com/Fg0ZcZdani
— The Bharat Army (@thebharatarmy) October 17, 2022