IND vs AUS | అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో జరుగుతున్న రెండోటెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా తొలి ఇన్సింగ్స్‌లో 337 పరుగులకు 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత రెండో ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్‌ను ప్రారంభించిన టీమిండియా.. పేలమైన బ్యాటింగ్స్తో 128 పరుగులకు ఐదు వికెట్ల కోల్పోయి పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంకా భారత జట్టు 29 పరుగులు వెనుకబడి ఉన్నది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 28 పరుగులు, నితీశ్ కుమార్‌రెడ్డి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌర్లలో పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరోరెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్‌కి ఒక వికెట్ దక్కింది. ఐదు టెస్టు మ్యాచుల బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం అడిలైడ్ ఓవల్ వేదికగా రెండోటెస్ట్ ప్రారంభమైంది. ఇది డే-నైట్ టెస్ట్ మ్యాచ్ గులాబీ రంగు బంతితో జరుగుతున్నది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకున్నది. తొలి ఇన్నింగ్స్ భారత్ 180 పరుగులకు కుప్పకూలింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసి.. 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ట్రావిస్ హెడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 140 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీమిండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెరో నాలుగు వికెట్ల పడగొట్టారు. నితీశ్‌రెడ్డి, ఆర్ అశ్విన్‌కు చెరో వికెట్ దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా తడబడింది. ఆసిస్ బౌలర్ల ముందు బ్యాటర్లు తేలిపోయారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ జోడీ ఇన్నింగ్స్ ప్రారంభించగా.. 12 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ జైస్వాల్ (24), విరాట్ కోహ్లీ (11), శుభ్‌మన్ గిల్ (28), రోహిత్ శర్మ (6) అవుట్ అయ్యారు. ప్రస్తుతం రిషబ్ పంత్ (28), నితీశ్ రెడ్డి (15) క్రీజులో ఉన్నారు. రిషబ్ పంత్, నితీశ్‌రెడ్డి జోడీ ఏదైనా అద్భుతం చేయగలిగితేనే టీమిండియా మ్యాచ్‌పై పట్టు సాధించే ఛాన్స్ ఉంది. లేకపోతే భారీ ఓటమి తప్పదు.