ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు తొలి ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (11) మూడో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. హాజిల్‌వుడ్ వేసిన ఆ ఓవర్ తొలి బంతికి కేఎల్ రాహుల్ భారీ సిక్సర్ బాదాడు.
అదే ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్.. టైమింగ్ మిస్ అయ్యాడు. దీంతో నాథన్ ఎల్లీస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చాలా ఎత్తుగా గాల్లోకి లేచిన బంతిని దూరం నుంచి పరిగెత్తుకు వచ్చిన ఎల్లీస్ అద్భుతంగా అందుకోవడంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత జట్టు మూడు ఓవర్లు ముగిసేసరికి 25/1 స్కోరుతో నిలిచింది.