Rishabh Pant | ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టుకు దూరంగా ఉండాలని కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో టీమిండియా రోహిత్ లేకుండానే సిడ్నీ టెస్టులో బరిలోకి దిగింది. ఇక రోహిత్ తీసుకున్న నిర్ణయంపై స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రశంసలతో ముంచెత్తాడు. రోహిత్ నిర్ణయం భావోద్వేగమైన.. నిస్వార్థ చర్యగా అభివర్ణించాడు. రోహిత్ నిజమైన నాయకుడని తెలిపాడు. జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొని బుమ్రాకు బాధ్యతలు అప్పగించాడని చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నిర్ణయాత్మకమైన సిడ్నీ టెస్టులో భారత్ తుది జట్టులో రెండుమార్పులు చేసింది. రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్, ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం ఇచ్చింది. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత పంత్ మాట్లాడుతూ కొన్ని నిర్ణయాల్లో ఒకరు జోక్యం చేసుకోరు.
దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఉద్వేగభరితమైన నిర్ణయం. మేము రోహిత్‌ను నాయకుడిగా చూస్తున్నాం’ అని పేర్కొన్నారు. మ్యాచ్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయం పూర్తిగా రోహిత్‌దేనని టాస్ సందర్భంగా బుమ్రా పేర్కొన్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో తన సహజమైన దూకుడును ప్రదర్శించలేకపోయానని.. తొలిరోజు ఓపికతో బ్యాటింగ్ చేశానని రిషబ్ పేర్కొన్నారు. మెల్బోర్న్లో బాధ్యతారహిత షాట్లు ఆడుతూ వికెట్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న పంత్.. సిడ్నీ టెస్టులో మాత్రం 98 బంతుల్లో 40 పరుగులు చేశాడు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. పంత్ మాట్లాడుతూ ‘ఈ ఇన్నింగ్స్‌లో నేను వికెట్‌ను దృష్టిలో ఉంచుకుని దూకుడుగా ఆడే పరిస్థితిలో లేను. కొన్నిసార్లు డిఫెన్స్‌గా ఆడాలి. నేను 50-50 రిస్క్ తీసుకోవాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ, నేను అలా చేయలేదు. సహజంగానే దూకుడు, రక్షణాత్మక ఆటను సమతుల్యం చేయడం నేర్చుకోవాలని.. బాగా ఆడలేనప్పుడు ఎక్కువగా ఆలోచించడం మొదలుపెడుతారు’ అంటూ పంత్ వ్యాఖ్యానించాడు.
Rishabh Pant About Rohit Sharma 🥹❤️ #INDvsAUS pic.twitter.com/NKhZOB9ejP
— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) January 3, 2025