Siraj | టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో తన దూకుడును కొనసాగించాలని మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి సూచించాడు. హైదరాబాదీ ఫాస్ట్‌బౌలర్ ఎక్కడా తగ్గకూడదని చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రవిశాస్త్రి హయాంలో టీమిండియా రెండు సిరీస్‌లను గెలుచుకున్నది. ఆ సమయంలో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఆటగాళ్లు దూకుడుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రవిశాస్త్రి భారత జట్టుకు ఈ సూచన చేశాడు. జట్టులోని ఏ ఒక్క ఆటగాడు వెనక్కి తగ్గొద్దని చెప్పాడు. మనపై ప్రత్యర్థి ఎంత తీవ్రంగా స్పందిస్తే.. మనం కూడా అదే స్థానంలో సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ఓ ఫాస్ట్‌బౌలర్ వేసిన బంతిని ఎవరైనా సిక్స్ కొడితే సహజంగానే ఆ బౌలర్ నుంచి దూకుడు ప్రవర్తన ఉంటుందని.. అయితే, సిరాజ్ కొద్దిసేపు భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయాడని.. అది ఫాస్ట్ బౌలర్ టెంపర్ అని తెలిపారు. తాను కోచ్‌గా ఉన్న సమయంలో ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆటగాళ్లకు ఎప్పుడూ ఒక్కటే చెప్పానని.. మీకు ఎలాంటి స్పందన వచ్చిందో.. అలాగే ప్రతి స్పందించాలని చెప్పాను.
అయితే, హెడ్‌తో వివాదం తర్వాత సిరాజ్‌ను కొద్దిగా తగ్గాలని సూచించారని.. తాను మాత్రం టీమిండియా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దన్నారు. 2018-19, 202-21లో ఆస్ట్రేలియాలో భారత జట్టు సిరీస్‌లను గెలుచుకుందని.. ఆ సమయంలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ దూకుడుగా ఆసిస్‌తో పోటీపడ్డారంటూ గుర్తు చేశారు. వెనక్కి తగ్గకూడదన్నది జట్టు ఫిలాసఫీగా మారిపోయిందని.. విరాట్ నుంచి పంత్ వరకు అందరూ ఆస్ట్రేలియాకు బదులిచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌పై సైతం మాజీ కోచ్ స్పందించారు. బ్రిస్బేన్ టెస్ట్‌లో రోహిత్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు రావాలని కోరుకుంటున్నారని.. గతంలో మాదిరిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలన్నారు. అడిలైడ్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, సిరాజ్ మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకున్నది. బౌల్డ్ అయ్యాక హెడ్.. సిరాజ్ ఏదో అనగా.. ముందు ఇక్కడి నుంచి వెళ్లూ అన్నట్లుగా సిరాజ్ చెప్పాడు. ఈ వ్యవహారంలో ఐసీసీ సిరాజ్‌కు జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధించింది. ట్రావిస్ హెడ్‌ను మదలించింది.