IND vs AUS : పవర్ ప్లేలో తొలి వికెట్ పడినా కూడా ఆసీస్ జోరు తగ్గలేదు. డేంజరస్ మాథ్యూ షార్ట్(13) తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లిస్(63) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండ్రీకి పంపిన అతడు.. బిష్ణోయ్ వేసిన 12వ ఓవర్లో సిక్సర్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో, రన్‌రేట్ 9 దాటిపోయింది. మరోవైపు స్టీవ్ స్మిత్ (32 కూడా జోరు పెంచాడు. దాంతో, ఆసీస్ స్కోర్ బోర్డు 100 దాటింది పరుగులు తీస్తోంది. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్.. 110/1.
SIX to get to his maiden T20I fifty!
He’s giving Australia a shot at a big total here
— ESPNcricinfo (@ESPNcricinfo) November 23, 2023
భారత యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన తొలిఓవర్లోనే మ్యాజిక్ చేశాడు. భారత్‌కు తొలి వికెట్ అందించాడు. దంచికొడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ షార్ట్(13)ను బౌల్డ్ చేశాడు. దాంతో, మొదటి వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ (17), జోష్ ఇంగ్లిస్() క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు ఆసీస్ స్కోర్.. 40/1.