సిరిసిల్ల రూరల్, జనవరి 1 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్న పల్లె( Ramanna palle) గ్రామంలో ప్రతి ఇంటికి రూ.5 కే మినరల్ వాటర్(Mineral water) అందించేందుకు సర్పంచ్ ఆత్మకూరు జ్యోతి శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తాను గెలిస్తే ప్రతి ఇంటికి మినరల్ వాటర్ ను రూ.5 కే అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు నూతన సంవత్సర పురస్కరించుకొని గురువారం రూ.5 లకే మినరల్ వాటర్ సరఫరాను గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు. గ్రామంలోని ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకుడితో మాట్లాడి రూ.5 కే మినరల్ వాటర్ బబుల్ అందించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
మినరల్ వాటర్ బాబుల్ కి రూ.10 కి అందిస్తుండగా, ఇందులో సర్పంచ్ జ్యోతి రూ.5 లను నిర్వాహకుడికి చెల్లిస్తారు . తన పదవి ముగిసేవరకు రూ.5 కే మినరల్ వాటర్ అందిస్తామని సర్పంచ్ తెలిపారు. గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామస్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇప్పటికే గ్రామంలో ఎవరైనా మృతి చెందిన అంత్యక్రియలకు రూ. 5వేలు అందిస్తుండగా, నూతన సంవత్సరం వేల రూమ్ 5 కే ప్రతి ఇంటికి మినరల్ వాటర్ సరఫరా ప్రారంభించడంతో గ్రామంలో సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గణపురం శ్రీనివాస్ ,మేడుదుల ఎల్లవ్వ, పలుమారి లింగవ్వ , గణపురం తేజ , మందాటి తిరుపతి , సౌండవేని లచ్చయ్య , ఆత్మకూరు ముత్తయ్య , ఆత్మకూరు కరుణాకర్ , ఆత్మకూరు శ్రీనివాస్ , జీల చిన్న ఎల్లయ్య, మహిళలు ఉన్నారు.