Indian Cinema 2026 | 2026 సంవత్సరం భారతీయ సినిమా రంగంతో పాటు టాలీవుడ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైనది కాబోతుంది. ఎందుకంటే ఈ ఏడాదిలోనే టాలీవుడ్ గ్లోబల్ స్టార్స్ ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర నటుల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. బాలీవుడ్ నుంచి కూడా షారుఖ్ ఖాన్ సినిమాతో పాటు సల్మాన్ ఖాన్ సినిమాలు, తమిళం నుంచి దళపతి విజయ్ చివరి సినిమా, రజనీకాంత్ జైలర్ 2 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ఈ ఏడాది రాబోతున్న స్టార్ బజ్ ఉన్న సినిమాలను చూసుకుంటే.
1. ది రాజా సాబ్ (The Raja Saab): కొత్త ఏడాదిని ది రాజా సాబ్ సినిమాతో ప్రారంభించబోతున్నాడు అగ్ర కథానాయకుడు ప్రభాస్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ హారర్-కామెడీ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
2.మన శంకర వరాప్రసాద్ గారు: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది కూడా సంక్రాంతి బరిలోనే ఉంది.
3. అనగనగా ఒక రాజు: నవీన్ పోలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి నటిస్తున్న ఈ చిత్రం జనవరి 14న రిలీజ్ కానుంది.
4. స్పిరిట్ (Spirit): సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ పవర్ ఫుల్ పోలీస్ డ్రామా మే 14, 2026న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
5. డ్రాగన్ : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
6. సలార్: పార్ట్ 2 (Salaar: Part 2 – Shouryanga Parvam): ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ నవంబర్ 14, 2026న వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
7. పెద్ది (Peddi): రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా. ఇది మార్చి 27, 2026న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
8. ది ప్యారడైజ్ (The Paradise): నాని హీరోగా వస్తున్న ఈ యాక్షన్ డ్రామా మార్చి 26న విడుదల కానుంది.
9. డెకాయిట్ (Dacoit): అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ చిత్రం మార్చి 19న రాబోతోంది.
10. రామాయణ (Ramayana – Part 1): నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యష్ (రావణుడు) నటిస్తున్న ఈ విజువల్ వండర్ 2026 దీపావళికి వచ్చే అవకాశం ఉంది.
11. టాక్సిక్ (Toxic): కన్నడ స్టార్ యష్ నటిస్తున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
12. కింగ్ (King) – షారుఖ్ ఖాన్ : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ చిత్రం కూడా 2026లో రాబోతున్నట్లు సమాచారం.
13. బోర్డర్ 2 (Border 2): సన్నీ డియోల్, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ వార్ డ్రామా జనవరి 23, 2026న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కానుంది.
14. జననాయగన్ (Jananayagan) : దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న చివరి చిత్రం. ఈ సినిమా పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
15. బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ (Battle of Galwan) : సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
16. లవ్ అండ్ వార్ (Love & War): సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ నటిస్తున్న భారీ చిత్రం.
17. దృశ్యం 3 : మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ నటిస్తున్న క్రేజీ సీక్వెల్ దృశ్యం 3 కూడా ఇదే ఏడాది రాబోతున్నట్లు సమాచారం. ఇంకా ఇవే కాకుండా పలు ఇండస్ట్రీల నుంచి పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.