Mohammed Siraj | అడిలైడ్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన టెస్ట్‌లో ఆసిస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాక సిరాజ్ సంబరాలు చేసుకుంటూ సైగలు చేసిన విసయం తెలిసిందే. అయితే, హెడ్ తాను వెల్ బౌల్డ్ అన్నానని.. సిరాజ్ తప్పుగా అర్థం చేసుకున్నాడని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హెడ్ పేర్కొన్నారు. సిరాజ్‌కు తాను మాట్లాడిందని అర్థం కాలేదని చెప్పగా.. సిరాజ్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. హెడ్ అబద్ధం చెప్పాడని.. భారత జట్టు ప్రతి క్రీడాకారుడిని గౌరవిస్తుందన్నాడు. తాను ఇంతకు ముందెప్పుడూ వివాదాన్ని ప్రోత్సహించలేదని స్పష్టం చేశాడు. హెడ్ తనను దుర్భాషలాడడని.. అందుకు తాను దూకుడుగా వ్యవహరించాల్సి వచ్చిందని హైదరాబాదీ బౌలర్ పేర్కొన్నాడు.
తాను హెడ్‌కు బౌలింగ్ చేయడాన్ని ఆనందించానని.. బాగా బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తానని.. ఇద్దరి మధ్య గ్రౌండ్లో పోరుగు జరుగుతుందని చెప్పాడు. ఓ మంచి బంతిని వేసిన సమయంలో సిక్స్‌గా మలిస్తే ఏ బౌలర్‌కైనా బాధగానే ఉంటుందని సిరాజ్ చెప్పాడు. అందుకే హెడ్ అవుట్ అయ్యాక సంబరాలు చేసుకున్నానని చెప్పాడు. కానీ, ఆస్ట్రేలియా బ్యాటర్ అబద్ధాలు చెప్పాడని.. వెల్ బౌల్డ్ అన్నానని చెబుతున్నాడని.. అతను చెప్పిన దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశాడు. క్రికెట్ జెంటిల్మన్ గేమ్ అని.. హెడ్ ప్రవర్తన మాత్రం తప్పని.. నాకు బాగా అనిపించలేదని చెప్పాడు. అయితే, సిరాజ్‌తో వ్యహారంపై ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ తాను బాగా బౌలింగ్ చేశామని చెప్పానని.. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడని చెప్పాడు.
ఈ వ్యవహారంలో కాస్త నిరాశకు గురయ్యానని.. భారత్ ఇలాగే ఆడాలని కోరుకుంటే.. అలాగే ఆడాలని చెప్పాడు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో కంగారూ జట్టు సిరీస్‌లో పునరాగమనం చేసింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 180 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసి 157 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత్ రెండో ఇన్నింగ్స్ 175 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ సేన 18 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 19 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా సాధించింది. ఉస్మాన్ ఖవాజా తొమ్మిది పరుగులతో, మెక్‌స్వీనీ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సిరీస్‌లోని మూడో మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లో జరగనుంది. తొలి టెస్టులో భారత జట్టు 295 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
A century, a send-off, Travis Head reflects on a day full of action #AUSvIND pic.twitter.com/cNRZ5lxnSz
— cricket.com.au (@cricketcomau) December 7, 2024