మూడో టీ20లో ఆస్ట్రేలియాకు అద్భుతమైన ఆరంభం అందించిన కామెరూన్ గ్రీన్ (52) అవుటయ్యాడు. తొలి ఓవర్ నుంచే భారీ షాట్లతో విరుచుకుపడిన గ్రీన్.. ప్రతి బౌలర్‌ను ఒక ఆట ఆడేసుకున్నాడు. భువనేశ్వర్, బుమ్రా, అక్షర్ అందరి బౌలింగ్‌లో బౌండరీల వర్షం కురిపించాడు. అయితే ఎట్టకేలకు అతన్ని భువనేశ్వర్ పెవిలియన్ చేర్చాడు.
భువీ వేసిన 5వ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా రాలేదు. దీంతో ఒత్తిడికి గురైన గ్రీన్ చివరి బంతిని బలంగా గాల్లోకి లేపాడు. అయితే అది సరిగా కనెక్ట్ కాకపోవడంతో ఎక్కువ దూరం వెళ్లలేదు. దీన్ని కేఎల్ రాహుల్ సులభంగా పట్టేయడంతో గ్రీన్ పెవిలియన్ బాటపట్టాడు. అక్షర్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల నష్టానికి 62 స్కోరుతో నిలిచింది.