Sunil Gavaskar | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టు సాధించింది. రెండురోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని.. ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. 141 బంతుల్లో 140 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ ఆస్ట్రేలియా బ్యాటర్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసిస్తూ.. టీమిండియా ఆటగాళ్లపై విరుచుకుపడ్డారు. ఆస్ట్రేలియా బ్యాటర్లపై ఒత్తిడి పెంచడంలో భారత్ విఫలమైందన్నారు. భారత బౌలర్లు బౌన్సర్లు వేయలేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ట్రావిస్ హెడ్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడని చెప్పారు. భారత బౌలర్లు ఇదే విధంగా చేయడంలో విఫలమయ్యారన్నారు. హెడ్‌ను షార్ట్ బాల్‌తో పరీక్షించాల్సిందని.. కానీ, భారత్ అలా చేయలేకపోయిందన్నాడు.
ప్రపంచకప్ ఫైనల్లో భారత బౌలర్లు హెడ్‌ను పరీక్షించలేకపోయారని.. అతన్ని బౌన్సర్లతో చాలా అరుదుగా ప్రయత్నించారన్నారు. ఓవల్ లాంటి పిచ్‌లపై బౌనర్లు వేసి ప్రయత్నించాల్సిందని.. బౌలర్లు అలా ప్రయత్నించలేదన్నారు. భారత్‌పై ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసి 157 పరుగుల ఆధిక్యం సాధించింది. 140 పరుగులు చేసి ఆసిస్‌కు ఆధిక్యం అందించడంలో కీలకపాత్ర పోషించాడు. 82వ ఓవర్లో నాలుగో బంతికి సిరాజ్ అతన్ని బౌల్డ్ చేశాడు. అయితే, సిరాజ్ సహనం కోల్పోయి దూకుడుగా వ్యవహరించాడు. సిరాజ్ వైఖరిని గవాస్కర్ తప్పుపట్టాడు. ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాక సిరాజ్ సెల్యూట్ చేసి సెంచరీ చేసినందుకు గౌరవించి ఉంటే.. గ్రౌండ్లో అభిమానుల మధ్య హీరోగా ఎదిగి ఉండేవాడని.. కానీ, దానికి విరుద్ధంగా చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెంచరీ కొట్టిన లోకల్ హీరోపై అలా చేయడం సరికాదన్నారు.