IND vs AUS Gabba Test | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో మూడో టెస్ట్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు జట్లకు విజయం కీలకంగా మారింది. అయితే, ఈ మ్యాచ్‌కు ప్రారంభంలోనే వర్షం అంతరాయం కలిగించింది. తొలిసారి 5.3 ఓవర్ల తర్వాత వర్షం కారణంగా 20-25 నిమిషాల ఆట వృథా అయింది. మళ్లీ 13.2 ఓవర్ల తర్వాత మరోసారి ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ప్రస్తుతం ఉస్మాన్ ఖవాజా 13 పరుగులతో, మెక్‌స్వీనీ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టులో రెండు మార్పులతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. అశ్విన్, హర్షిత్ రాణా స్థానంలో జడేలా, ఆకాశ్‌దీప్‌లకు అవకాశం కల్పించింది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టులో స్కాట్ బోలాండ్ స్థానంలో హాజెల్‌వుడ్‌కు అవకాశం ఇచ్చింది. గబ్బా టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిస్బేన్ అంతా మేఘావృతమై ఉన్నది. వర్షం కురిసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి.
పాట్ కమిన్స్ (కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, అలెక్స్ కారీ, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియోన్, మిచ్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.