Rohit Sharma | బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య ఈ నెల 26 నుంచి మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ మొదలవనున్నది. బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ హెడ్‌కోచ్ రోహిత్ శర్మకు కీలక సూచన చేశారు. రోహిత్ స్పష్టమైన ఆలోచనతో మ్యాచ్‌కు వెళ్లాలని.. వ్యూహాలను మార్చుకోవాలని సూచించారు. అలాగే, దూకుడు ధోరణిని అవలంభించాలని చెప్పారు. గత కొంతకాలంగా రోహిత్ పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తొలిటెస్ట్‌కు రోహిత్ అందుబాటులో లేడు. మిగతా రెండు టెస్టుల్లో రాణించలేకపోయాడు. రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ తొలి టెస్టులో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. వీరిద్దరి జోడీ హిట్ కావడంతో రోహిత్ ఈ కాంబినేషన్‌ని మార్చకుండా.. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అడిలైడ్, గాబా టెస్టుల్లో ఆరో నంబర్లో బ్యాటింగ్ చేసినా.. అంతగా రాణించలేకపోయాడు. ఐసీసీ రివ్యూ కార్యక్రమంలో శాస్త్రి మాట్లాడుతూ.. రోహిత్ శర్మ రాణించడాన్ని తాను చూడాలనుకుంటున్నానన్నారు.
అతని వ్యూహంలో కొంచెం మార్పు ఉండాలని.. ఎందుకంటే ఆరో నెంబర్లోనూ అతడు ప్రమాదకర ఆటగాడేనన్నారు. ఫీల్డ్కి వెళ్లి ప్రత్యర్థి జట్టుపై ఎటాక్ చేయాలని.. ఇదే మైండ్‌సెట్‌లో ఉండాలన్నారు. రోహిత్ డిఫెన్సివ్ మైండ్ సెట్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అతని నుంచి ఎవరూ కోరుకోని విషయం ఏంటంటే.. అతడు డిఫెన్స్‌లో ఉండాలా.. ఎటాక్‌లో ఉండాలంటే..? రెండు రకాల ఆలోచనలు అతని మనసులో మనస్సులో ఉండాలని.. తాను మాత్రం ఎటాక్ చేయాలని అనుకుంటానన్నారు. ఆరో నెంబర్లోనూ ప్రత్యర్థి జట్టుపై ఎటాక్ చేయాలని.. అతని తొలి 10-15 నిమిషాలు క్రీజులో ఉండి తన సహజమైన ఆటను ఎందుకు ఆడడు? ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేయాలి. ఫామ్‌లోకి తిరిగి రావడమే కాకుండా భారత్ మ్యాచ్‌లు గెలిచేందుకు ఇదే ఉత్తమ మార్గమని భావిస్తున్నానన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌కు ఆరో నంబర్లో ఎలా ఎదురుదాడి చేయాలో తెలుసునని.. పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటారన్నారు. అయితే, వికెట్లు పడితే కాసేపు జాగ్రత్తగా ఉండాల్సిందేనని.. దూకుడుగా వ్యవహరించడంలో ఆలస్యం చేయొద్దని మాజీ హెడ్ కోచ్ సూచించారు.