IND Vs AUS T20 | కాన్బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా తొలి 20టీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మ్యాచ్ను తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు వెల్లడించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. వర్షం మ్యాచ్కు రెండుసార్లు అంతరాయం కలిగించింది. ఐదు ఓవర్ల తర్వాత మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత అంపైర్లు రెండు ఓవర్లు కుదించి.. 18 ఓవర్ల మ్యాచ్ ఆడించాలని నిర్ణయించారు. తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది. భారత్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. మరోసారి భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది.
తిరిగి మ్యాచ్ను ప్రారంభించే పరిస్థితి లేకపోవడంతో మ్యాచ్ను అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్లో శుభ్మాన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. రెండో వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆట ఆగిపోయే సమయానికి గిల్, సూర్యకుమార్ జోడీ 62 పరుగులు జోడించారు. సూర్యకుమార్ 24 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. గిల్ 20 బంతుల్లో.. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్ సహాయంతో 37 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 19 పరుగుల వద్ద నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఐదు టీ20ల సిరీస్లో రెండుజట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 31న మెల్న్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగనున్నది.