Rohit Sharma | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కొనసాగుతున్నది. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అవుట్ అయ్యాడు. రోహిత్‌ను మరోసారి పాట్ కమిన్స్ అవుట్ చేశాడు. కమిన్స్ వేసిన బంతి రోహిత్ బ్యాట్ ఎడ్జ్‌కి తాకి.. కీపర్ అలెక్స్ కారీ చేతుల్లోకి వెళ్లింది. 27 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టీమిండియా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా మరోసారి స్పందించారు. ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ టెస్ట్‌కి రోహిత్ దూరమైన విషయం తెలిసిందే. అడిలైడ్‌లో జరిగిన డే-నైట్ టెస్ట్‌కు అందుబాటులోకి వచ్చాడు.
ఓపెనింగ్‌కు దిగాల్సిన హిట్‌మ్యాన్ ఆరేళ్ల తర్వాత తొలిసారిగా మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగాడు. అడిలైడ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 23 బంతుల్లో మూడు పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 26 బంతుల్లో 9 పరుగులు చేసి రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. ఇక మూడో టెస్ట్‌లో రోహిత్ క్రీజులోకి వచ్చిన సమయంలో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. మూడోరోజు వర్షం కారణంగా క్రీజులో ఉండేందుకు ఎక్కువగా అవకాశం దొరకలేదు. నాలుగో రోజైన మంగళవారం కెప్టెన్ పది బంతులు ఎదుర్కొని.. పది పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అవుట్ అయ్యాక రోహిత్ చేతిలో గ్లౌజులు పెట్టుకుని పెవిలియన్ వైపు నడిచిన తీరు.. టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కానున్నాడనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకున్నది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
గత కొంతకాలంగా టెస్టుల్లోనూ పేలవమైన ఫామ్‌తో రోహిత్ ఇబ్బందిపడుతున్నాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌ని లక్ష్యంగా చేసుకొని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఏడాదిలో రోహిత్ పెద్దగా రాణించలేకపోయాడు. ఇప్పటి వరకు 24 ఇన్నింగ్స్‌లో 26.39 సగటుతో కేవలం 607 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రోహిత్ 91 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ గురించి చెప్పాలంటే నాలుగో రోజు వర్షం ఇబ్బంది కలిగించింది. ప్రస్తుతం గబ్బా టెస్ట్‌లో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసి ఫాల్ ఆన్ గండం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా క్రీజులో ఉన్నారు.
Rohit Sharma