IND vs AUS BGT : పెర్త్ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar trophy) తొలి టెస్టు (First test) రెండో ఇన్నింగ్స్ (Second Innings) లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) తన వ్యక్తిగత స్కోర్ 161 వద్ద ఔటయ్యాడు. జైస్వాల్ మొత్తం 297 బంతులను ఎదుర్కొని 161 పరుగులు (15 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేశాడు. అయితే జైస్వాల్ ఔట్ అనంతరం భారత బ్యాటింగ్ (India batting) లైనప్ తడబడింది.
వికెట్ కీపర్ రిషబ్ పంత్ (1), ధ్రువ్ జురేల్ (1) వెంటవెంటనే వికెట్లను సమర్పించుకున్నారు. దాంతో భారత్ కేవలం 8 పరుగుల వ్యవధిలో వరుసగా మూడు వికెట్లు కోల్పోయినట్లయ్యింది. మరో ఎండ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 45 బంతుల్లో 27 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. కోహ్లీకి తోడుగా వాషింగ్టన్ సుందర్ (2) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 334 పరుగులు. దాంతో ఆధిక్యం 380 పరుగులకు పెరిగింది.