IND vs AUS : రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(6) ఔటయ్యాడు. జడేజా తన తొలి ఓవర్లోనే కీలకమైన ఖవాజాను వెనక్కి పంపాడు. శ్రేయాస్ అయ్యార్ సూపర్ క్యాచ్ అందుకోవడంతో ఆసీస్ ఓపెనర్ వెనుదిరిగాడు. ట్రావిస్ హెడ్ (17)తో కలిసి అతను 23 పరుగులు జోడించాడు. మార్నస్ లబుషేన్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 31 పరుగుల ఆధిక్యంలో ఉంది.
మొదటి ఇన్నింగ్స్‌లో ఖవాజా అర్థ శతకం (81)తో జట్టుకు శుభారంభం ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న అతడిని ఔట్ చేసి జడ్డూ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 262 రన్స్ వద్ద ఆలౌట్ అయింది. పర్యాటక ఆస్ట్రేలియాకు ఒక పరుగు ఆధిక్యం లభిచింది. ఆసీస్ బౌలర్లలో లయాన్ ఐదు వికెట్లు తీశాడు, కుహ్నేమాన్, మర్ఫీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కమిన్స్‌కు ఒక వికెట్ దక్కింది.