IND Vs AUS | సిడ్నీ టెస్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత జట్టు 145 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 181 పరుగులకే కుప్పకూలింది. భారత్ కంటే నాలుగు పరుగులు వెనకపడిపోయింది. సిడ్నీ టెస్టు రెండోరోజు ఇరుజట్లు కలిపి మొత్తం 313 పరుగులు చేయగా.. 15 వికెట్లు కోల్పోయాయి. ఇందులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లను కోల్పోగా.. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో రెండోరోజు ఆట ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.
రెండోరోజు ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా (8), వాషింగ్టన్ సుందర్ (6) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. సిడ్నీ మైదానంలో 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు కనీసం 200 టార్గెట్ నిర్దేశించాలని భావిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి సిడ్నీలో 12 సార్లు మాత్రమే 200 కంటే ఎక్కువ లక్ష్యాన్ని సాధించాయి. ఇందులో ఒకసారి ఛేజింగ్ జట్టు ఒకసారి మాత్రమే గెలిచింది. నాలుగు మ్యాచులు డ్రా కాగా.. ఛేజింగ్‌లో ఉన్న జట్టు ఏడుసార్లు ఓటమిపాలైంది. 2006లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 287 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు శుభారంభం లభించింది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. రాహుల్ 13 పరుగులు, యశస్వి 22 పరుగుల వద్ద బోలాండ్కు పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ 13 పరుగులు చేసి బ్యూ వెబ్‌స్టర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ వెలుపల వెళ్తున్న బంతిని వెంటాడే ప్రయత్నం విరాట్ కోహ్లీ మరోసారి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రిషబ్ పంత్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. పంత్ 33 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేశాడు. ఇక నితీశ్‌రెడ్డి వరుసగా మూడో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. నాలుగు పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆస్ట్రేలియా తరఫున బోలాండ్ ఇప్పటి వరకు నాలుగు వికెట్లు పడగొట్టగా.. కమిన్స్, వెబ్‌స్టర్‌లకు చెరో వికెట్ దక్కింది.
రెండో రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయిన తర్వాత.. కెప్టెన్ బుమ్రా మైదానాన్ని వీడి స్కానింగ్ కోసం ఆసుపత్రికి చేరుకున్నాడు. బుమ్రా మైదానాన్ని వీడినా.. మిగతా ఫాస్ట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. మిగతా నాలుగు వికెట్లను పడగొట్టారు. బుమ్రా గైర్హాజనరీలో కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో మూడు వికెట్లు తీయగా.. నితీశ్‌రెడ్డి, బుమ్రా రెండేసి వికెట్ల దక్కాయి.
ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి తొమ్మిది పరుగుల వద్ద రెండోరోజు ఆటను ప్రారంభించింది. ఆ తర్వాత మరో 172 పరుగులు చేసి తొమ్మి వికెట్లను కోల్పోయింది. బుమ్రా మార్నస్ లాబుస్చగ్నే వికెట్ కీపర్ పంత్ చేతికి చిక్కాడు. 12వ ఓవర్లో శామ్ కాన్స్టాస్, ట్రావిస్ హెడ్లను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి స్టీవ్ స్మిత్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ అలెక్స్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు. బ్యూ వెబ్‌స్టర్ అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీతో అలరించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో ఆకట్టుకోలేకపోయిన నితీశ్‌రెడ్డి.. బౌలింగ్‌లో రెండు వికెట్ల పడగొట్టాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వరుస బంతుల్లో కీలకమైన వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా 45 ఓవర్ చివరి బంతికి పాట్ కమిన్స్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నితీశ్ వేసిన 47వ ఓవర్లో తొలి బంతికి మిచెల్ స్టార్క్.. రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నితిశ్ హ్యాట్రిక్ తుట్రిలో మిస్ అయ్యింది. 47వ ఓవర్లో రెండో బంతిని లియన్ లెగ్‌సైడ్ వైపు మళ్లించి.. ఖాతా తెరిచాడు. ఇక 166 పరుగుల వద్ద ఆస్ట్రేలియాకు 9వ దెబ్బ తగిలింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో బ్యూ వెబస్టార్.. యశస్వికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 105 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక సిరాజ్ చివరగా బోలాండ్(9)ని క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 181 పరుగుల వద్ద ముగిసింది.