అబుధాబి: టీమిండియా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. పాక్, న్యూజిల్యాండ్ చేతిల్లో పరాభవాల తర్వాత మిగతా మూడు మ్యాచుల్లో భారీ తేడాతో గెలుపొందాల్సిన పరిస్థితిలో భారత్ ఉంది. ఇలాంటి క్రమంలో ఆఫ్ఘనిస్థాన్‌పై బరిలో దిగిన భారత్‌కు అద్భుతమైన ఆరంభం లభించింది. రోహిత్ శర్మ (53 నాటౌట్), కేఎల్ రాహుల్ (52 నాటౌట్) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
దీంతో 12.1 ఓవర్లు ముగిసే సరికి భారత్ 111/0తో నిలిచింది. వీరిద్దరూ ఇదే జోరు కొనసాగిస్తే టీమిండియా భారీ స్కోరు చేయడం ఖాయం. ఆ తర్వాత బౌలర్లు కొంచెం గట్టిగా ప్రయత్నించినా టీమిండియా ఘనవిజయం సాధించి, సెమీస్ పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.