అబుధాబి: ఆఫ్ఘన్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న టీమిండియాకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కోల్పోకుండా 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ పార్టనర్‌షిప్‌ను కరీమ్ జనత్ విడదీశాడు. అతని బౌలింగ్‌లో బౌండరీ కోసం ప్రయత్నించిన రోహిత్ శర్మ (74) ఎక్స్ట్రా కవర్స్‌లో ఉన్న ఆఫ్ఘన్ కెప్టెన్ నబీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (66 నాటౌట్) క్రీజులోనే ఉన్నాడు. అయితే అనూహ్యంగా రోహిత్ అవుటైన తర్వాత విరాట్ కోహ్లీకి బదులుగా రిషభ్ పంత్ బరిలో దిగాడు. ప్రస్తుతం రాహుల్, పంత్ క్రీజులో ఉన్నారు.