అబుధాబి: భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ జట్టును పేసర్ మొహమ్మద్ షమీ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. మూడో ఓవర్ వేసిన అతను చివరి బంతికి మొహమ్మద్ షెహజాద్ (0)ను డకౌట్ చేశాడు. అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. స్క్వేర్ లెగ్ దిశగా గాల్లోకి లేచిన బంతిని అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ సులభంగా అందుకున్నాడు.
ఆ వెనువెంటనే బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా మరో వికెట్ కూల్చాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన హజ్రతుల్లా జజాయ్.. శార్దూల్ ఠాకూర్‌కు చిక్కాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టు 13/2తో కష్టాల్లో పడింది.