అబుధాబి: ఈ టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి టీమిండియా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ (74), రాహుల్ (69) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (35), పంత్ (27) మెరుపులతో భారత్ 210 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారీ లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ జట్టును పేసర్లు మహమ్మద్ షమీ, బుమ్రాలు ఆదిలోనే దెబ్బతీశారు. వీరిద్దరూ వరుస బంతుల్లో మొహమ్మద్ షెహజాద్ (0), హజ్రతుల్లా జజాయ్ (13)ను పెవిలియన్ చేర్చారు. ఆ తరువాత జడేజా బౌలింగ్‌లో గుర్బాజ్ (19) కూడా అవుటయ్యాడు. చాలా గ్యాప్ తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్లో బౌలింగ్ చేసిన అశ్విన్ (2/14) ఆఫ్ఘన్ మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు.
అతని దెబ్బకు గుల్బాదిన్ నైబ్ (18), నజిబుల్లా జద్రన్ (11) పెవిలియన్ చేరారు. 19వ ఓవర్ వేసిన మహమ్మద్ షమీ మరోసారి విజృంభించాడు. ఆఫ్ఘన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ (35), రషీద్ ఖాన్ (0)ను అవుట్ చేశాడు. టీమిండియా సమిష్టిగా రాణించడంతో ఛేజింగ్‌లో ఏ దశలోనూ ఆఫ్ఘనిస్థాన్‌కు గెలుపు అవకాశాలు కనిపించలేదు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 144/7తో నిలిచింది. విజయానికి 67 పరుగులు దూరంలో నిలిచిపోయింది. భారత బౌలర్లలో షమీ 3, అశ్విన్ 2 వికెట్లు ఖాతాలో వేసుకోగా.. బుమ్రా, జడేజా చెరో వికెట్ కూల్చారు. టీమిండియాకు అద్భుత ఆరంభం అందించిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.