అబుధాబి: సుమారు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటుతున్నాడు. టీ20 ప్రపంచకప్ తొలి రెండు మ్యాచుల్లో అతన్ని ఎందుకు తీసుకోలేదా? అని అనుకునేలా బౌలింగ్ చేస్తున్నాడు.
తన రెండో ఓవర్లో గుల్బాదిన్ నైబ్ (18)ను ఎల్బీగా అవుట్ చేసిన అతను.. మూడో ఓవర్లో నజిబుల్లా జద్రాన్ (11)ను బౌల్డ్ చేశాడు. అశ్విన్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేద్దామనుకున్న అతను ఆ బంతి మార్గాన్ని అంచనా వేయలేకపోయాడు. దీంతో బౌల్డ్ అయ్యాడు.