బ్రిస్బేన్: మెగాటోర్నీకి పూర్తి స్థాయిలో సిద్ధమవుదామనుకున్న భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ మధ్య బుధవారం జరుగాల్సిన వామప్ మ్యాచ్ బంతి పడకుండానే రద్దయ్యింది.
తొలి వామప్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన టీమ్ఇండియా మలి మ్యాచ్లోనూ సత్తాచాటాలని చూసింది. కానీ గబ్బాలో విరామం లేకుండా వర్షం పడటంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. దీంతో ఆటకు అనుకూలంగా లేదన్న కారణంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.