చతోగ్రామ్ : వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన రెండో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 77 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలుచుకున్న బంగ్లాదేశ్ సిరీస్‌ను 2-0తో దక్కించుకుంది. తొలుత బంగ్లాదేశ్ 3 వికెట్లకు 202 పరుగులు చేయగా, ఛేదనలో ఐర్లాండ్ 9 వికెట్లకు 125 పరుగులకే పరిమితమైంది.
బంగ్లా ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ 83, రోని తాలూక్దార్ 44, షకీబ్ అల్హసన్ 38(నాటౌట్), తౌహిద్ హ్రిదోయ్ 24 పరుగులు చేయగా బెంజమిన్ వైట్ 2 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్ కాంఫర్ అర్ధసెంచరీ(50), హారీ టెక్టర్ 22, గ్రాహం హ్యూమ్ 20 పరుగులు చేయగా తతిమావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. షకీబ్ అల్ హసన్ 5, తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన షకీబ్ అల్హసన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిది శుక్రవారం ఇక్కడే జరుగుతుంది.