చండీఘడ్: రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్(Riyan Parag) వివాదంలో చిక్కుకున్నాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్మోకింగ్ చేశాడు. ఎలక్ట్రానిక్ డివైస్‌తో స్మోక్ చేసినట్లు కనిపించింది. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. ఈ ఘటన ఇన్నింగ్స్ 16వలో చోటుచేసుకున్నది. అప్పటికే పరాగ్ ఔటై పెవిలియన్‌కు చేరుకున్నాడు.
16 బంతుల్లో 29 రన్స్ చేసిన నిష్క్రమించిన పరాగ్.. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో దమ్ముకొట్టే విజువల్స్ కెమెరాకు చిక్కాయి. దీని పట్ల అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. స్టేడియంలో ఉన్నప్పుడు ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన నియమావళి ఉన్నది. బీసీసీఐ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నది.
డ్రెస్సింగ్ రూమ్‌లో కానీ, డగౌట్లో కానీ పొగాకు ఉత్పత్తులను సేవించడం నిషేధం. ఈ నేపథ్యంలో పరాగ్‌కు శిక్ష తప్పదని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఇటీవల ఆర్ఆర్ టీమ్ మేనేర్ రోమి బిందర్కు కూడా లక్ష జరిమానా పడిన విషయం తెలిసిందే. అతను డగౌట్లో మొబైల్ ఫోన్ వాడారు. ఏప్రిల్ 10వ తేదీన ఆ ఘటన జరిగిన విషయ తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని బీసీసీఐ అతనికి నోటీసు కూడా ఇచ్చింది. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో రాజస్థాన్ 222 రన్స్ చేజ్ చేసి పంజాబ్ దూకుడుకు బ్రేక్ వేసింది.
Riyan parag smoking vape in dressing room .. is this legal @IPL pic.twitter.com/91yqwH105e
— Prxtham.Edits18 (@Prxtham_Edits18) April 28, 2026