చెన్నై: ఐపీఎల్లో (IPL 2025) ఇవాళ చెన్నైతో డీసీ ఆడుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ అతను.. ఈ మ్యాచ్‌లో ఆడుతాడో లేదో డౌట్ ఉండె. ధోనీ ఈ మ్యాచ్‌కు కెప్టెన్సీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ టాస్ కోసం గైక్వాడ్ రావడంతో.. ఆ రూమర్స్‌కు చెక్ పడింది.
ఒకవేళ టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని గైక్వాడ్ తెలిపాడు. గత మ్యాచ్‌లో పర్ఫార్మెన్స్ బాగున్నా… ఫీల్డింగ్ ఆశించిన స్థాయిలో చేయలేకపోయినట్లు చెప్పాడు. గాయం నుంచి కోలుకున్న అతను తన మోచేయి బాగున్నట్లు తెలిపాడు. ఓవర్టన్ స్థానంలో కాన్వే, త్రిపాఠి స్థానంలో ముఖేశ్ జట్టులోకి వచ్చినట్లు రుతురాజ్ తెలిపాడు. డీసీ జట్టులోకి సమీర్ రిజ్వి వచ్చాడు.
🚨 Toss 🚨@DelhiCapitals won the toss and elected to bat against @ChennaiIPL
Updates ▶️ https://t.co/5jtlxucq9j #TATAIPL | #CSKvDC pic.twitter.com/YQ2hx92XNM
— IndianPremierLeague (@IPL) April 5, 2025