Imane Khelif | అల్జీర్స్: ఒలింపిక్స్‌లో వివాదాస్పద బాక్సర్‌గా ముద్రపడ్డ ఇమానె ఖెలిఫ్ మహిళనా? లేక పురుష లక్షణాలు ఉన్న అబ్బాయా? అన్న చర్చలు జోరుగా సాగుతున్న వేళ ఇదేవిషయమై ఆమె తండ్రి ఒమర్ ఖెలిఫ్ స్పష్టతనిచ్చాడు. ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘నా బిడ్డ అమ్మాయే.
అందుకు సంబంధించి ఆమె జనన ధృవీకరణ పత్రంతో పాటు పూర్తి ఆధారాలూ మావద్ద ఉన్నాయి. ఆమె దృఢమైన అమ్మాయి. చిన్ననాటి నుంచీ ధైర్యంగా ఉండటం, కష్టపడటం నేర్పించాం. ఇటాలియన్ బాక్సర్ కంటే దృఢంగా ఉండటం వల్లే ఆమెను ఓడించింది..’ అని అన్నాడు.