మాంట్రియాల్ (కెనడా): ఇటీవలే ముగిసిన వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్ గెలిచిన జోష్‌లో ఉన్న పోలండ్ బామ ఇగా స్వియాటెక్.. యూఎస్ ఓపెన్‌కు ముందు జరుగుతున్న మాంట్రియాల్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో స్వియాటెక్.. 6-3, 6-1తో హన్యు (చైనా)పై అలవోక విజయం సాధించింది.
వింబుల్డన్ రన్నరప్ అనిసిమొవ, ఎమ్మా రడుకాను, బెలిందా బెన్‌కిక్, జెస్సిక పెగులా, రిబాకినా సైతం తదుపరి రౌండ్‌కు చేరారు.