కోల్‌కతా: ఐఎఫ్ఏ షీల్డ్ ఫుట్‌బాల్ టోర్నీలో శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎస్‌డీఎఫ్‌సీ) రన్నరప్‌గా నిలిచింది. కోల్‌కతా వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీనిధి ఎఫ్‌సీ 1-2 తేడాతో రియల్ కశ్మీర్ ఎఫ్‌సీ చేతిలో ఓడిపోయి ట్రోఫీని చేజార్చుకుంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో డేవిడ్ మునజ్ 29వ నిమిషంలో గోల్ చేయడంతో ఎస్‌డీఎఫ్‌సీ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. 90 నిమిషాల వరకు ప్రత్యర్థిని ప్రతిఘటిస్తూనే గోల్ చేసేందుకు శ్రీనిధి ఎఫ్‌సీ తీవ్రంగా శ్రమించింది. ఈ సమయంలో రియల్ కశ్మీర్ క్లబ్ తరఫున ఫ్రాన్ గొంజాలెజ్ గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్‌లో 101వ నిమిషాన కశ్మీర్ ఎఫ్‌సీ మరో గోల్‌తో ఆధిక్యం రెట్టింపు చేసుకుంది. ఆఖరి వరకు తీవ్రంగా శ్రమించిన ఎస్‌డీఎఫ్‌సీ ఓటమిని చవిచూసింది. దేశంలోనే రెండో అతిపురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ అయిన ఐఎఫ్ఏ షీల్డ్ టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన శ్రీనిధి ఎఫ్‌సీ అద్భుత ప్రదర్శనతో తుది పోరుకు చేరడం అసాధారణ విషయం. ఈ నెల 27 నుంచి జరుగనున్న హీరో ఐ-లీగ్ సీజన్ 2021-22కు శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ సిద్ధమవుతున్నది.