లండన్: ఇంగ్లండ్‌పై లార్డ్స్ టెస్ట్ విజయంలో సెంచరీతో కీలకపాత్ర పోషించిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కేఎల్ రాహుల్( KL Rahul ).. మ్యాచ్ తర్వాత ప్రత్యర్థికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. తన పనేదో తాను చేసుకెళ్తూ.. ఫీల్డ్‌లో చాలా కామ్‌గా కనిపించే రాహుల్ ఈసారి కాస్త ఘాటుగానే స్పందించాడు. రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ప్లేయర్స్ పదే పదే రెచ్చగొట్టేలా వ్యవహరించిన విషయం తెలిసిందే. మొదట ఆండర్సన్-కోహ్లి, బుమ్రా-బట్లర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. దీనిపైనే రాహుల్ ఇలా స్పందించాడు. మీరు టీమ్‌లో ఒక్కరిని వేధిస్తే.. మొత్తం టీమ్‌లోని 11 మందీ మీ వెంట పడతారు అని ఇంగ్లండ్‌కు దిమ్మదిరిగే హెచ్చరికలు జారీ చేశాడు.
రెండు బలమైన జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు అత్యుత్తమ ఆటతోపాటు కొన్ని మాటల యుద్ధాలు కూడా సహజమే. అయితే ఇది ఓ మోస్తరు వరకూ బాగానే ఉంటుంది కానీ శృతి మించకూడదు. మీరు ఒక్కరి వెంట పడితే.. మా టీమంతా మీ వెంట పడుతుంది అని రాహుల్ అనడం విశేషం. ఈ స్ఫూర్తితోనే మా టీమంతా ఒక్కటిగా ముందుకు వెళ్తుంది అని అతడు చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 129 పరుగులు చేసి టీమ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించిన రాహుల్ ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
ఆ కవ్వింతలే దూకుడు పెంచాయి: కోహ్లి
మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా లార్డ్స్ టెస్ట్‌లో జరిగిన మాటల యుద్ధంపై స్పందించాడు. ఫీల్డ్‌లో జరిగిన మాటల యుద్ధమే మాలో మరింత దూకుడు పెంచాయి. అదే మ్యాచ్‌ను గెలవాలన్న కసిని మాలో నూరిపోసింది అని కోహ్లి అన్నాడు. 2014లోనూ ధోనీ కెప్టెన్సీలోని టీమిండియా లార్డ్స్ టెస్ట్‌లో గెలిచింది. ఆ మ్యాచ్‌పై కోహ్లి స్పందిస్తూ.. అప్పుడు కూడా ఓ ప్లేయర్‌గా విన్నింగ్ టీమ్‌లో ఉన్నాను. ఆ మ్యాచ్‌లో ఇషాంత్ 7 వికెట్లు తీసి రాణించాడు. కానీ ఈ మ్యాచ్‌ను మాత్రం 60 ఓవర్లలోపే ఫలితం రాబట్టడం చాలా సంతోషంగా ఉంది. లార్డ్స్‌లో తొలిసారి ఆడుతున్న సిరాజ్‌లాంటి బౌలర్ అలా బౌలింగ్ చేయడం అద్భుతం అని కోహ్లి అన్నాడు.
🗣️ @klrahul11: India as a team are never shy to say a word or two, if someone goes at one of our players and the rest of the 10 guys get pumped, that is the kind of team India are. If you go after one of our guys, that means you are going after the whole team#ENGvIND pic.twitter.com/1WOiw4OhVR
— ESPNcricinfo (@ESPNcricinfo) August 17, 2021
Kl Rahul : "If you go after one of our guys all eleven will come right back."
— Charan (@Tamasha999) August 16, 2021
#IndvsEng pic.twitter.com/WGYlj9vHEy