BCCI – IDFC Bank : భారత ప్రైవేట్ బ్యాంక్ ఐడీఎఫ్సీ ఫస్ట్ (IDFC First Bank) క్రికెట్లో అడుగుపెట్టనుంది. ఈ బ్యాంక్ తాజాగా బీసీసీఐ మీడియా హక్కులు(BCCI Media Rights) దక్కించుకుంది. మూడేళ్ల కాలానికి బీసీసీఐకి రూ. 235 కోట్ల భారీ ధర చెల్లించనుంది. ఈమేరకు ఐడీఎఫ్సీ, భారత క్రికెట్ బోర్డు మధ్య ఒప్పందం కుదిరింది. రూ. 2.4 కోట్ల కనీస ధరతో వేలం ప్రక్రియ మొదలైంది. కానీ, సోనీ స్పోర్ట్స్(Star Sports) నుంచి ఐడీఎఫ్సీ బ్యాంక్‌కు గట్టి పోటీ ఎదురైంది.
అయితే.. చివరకు రూ.4.2 కోట్లతో మీడియా రైట్స్ సొంతం చేసుకుంది. ఇకనుంచి ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఐడీఎఫ్సీ రూ.4.2 కోట్లు చెల్లించనుంది. గతంలో కంటే రూ.40 లక్షలు ఎక్కువ. ఇంతకుముందు మాస్టర్ కార్డ్ సంస్థ ప్రతి ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు రూ.3.8 కోట్లు బీసీసీఐకి ముట్టజెప్పేది.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మూడేళ్ల పాటు బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. 2026 ఆగస్టులో ఈ కాంట్రాక్టు ముగియనుంది. ఈ సమయంలో భారత జట్టు 56 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుందది. దాంతో, మొత్తంగా 235 కోట్ల రూపాయలు బీసీసీఐకి సమకూరనున్నాయి. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌తో బీసీసీఐ మీడియా ప్రచారకర్తగా ఐడీఎఫ్సీ సేవలందింనుంది.