ICC World Cup | అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ (ICC World Cup 2023) మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. పుష్కర కాలం తర్వాత భారత్‌లో జరుగనున్న మెగాటోర్నీ అక్టోబర్ 5నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ కోసం ఐసీసీ ప్రత్యేకంగా సాంగ్‌ను రూపొందించింది. ‘దిల్ జషన్ బోలే’ (Dil Jashn Bole) పేరుతో రూపొందించిన ఈ సాంగ్‌కు బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh)తోపాటు చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ (Dhanashree Verma) తదితరులు ఆడిపాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ (ICC) ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
కాగా, ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో మెగా సమరం ప్రారంభం కానుంది. తొలి పోరుకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన అహ్మదాబాద్ వేదిక కానుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగనున్న పోరుతో టీమ్ఇండియా ప్రపంచకప్ వేట ప్రారంభించనుంది. అదేవిధంగా భారత్.. అక్టోబర్ 15న తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. దాయాదుల పోరుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. నవంబర్ 19న జరుగనున్న ఫైనల్‌తో వరల్డ్‌కప్ ముగియనుంది.
నవంబర్ 15న తొలి సెమీఫైనల్‌కు ముంబై, 16న రెండో సెమీఫైనల్‌కు కోల్‌కతా ఆతిథ్యమివ్వనుండగా.. ఫైనల్ అహ్మదాబాద్ స్టేడియంలో నిర్వహించనున్నారు. మొత్తం 10 వేదిక (హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పుణె, బెంగళూరు, ముంబై, కోల్‌కతా)ల్లో మెగాటోర్నీ జరుగనుంది. ఇక తొలిసారి ఈశాన్య రాష్ర్టాల్లోని గువాహటిలో ప్రపంచకప్ వామప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక భారత్‌లో చివరిసారిగా (2011) జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజేతగా నిలిచింది. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
DIL JASHN BOLE! #CWC23
Official Anthem arriving now on platform 2023 📢📢
Board the One Day Xpress and join the greatest cricket Jashn ever! 🚂🥳
Credits:
Music – Pritam
Lyrics – Shloke Lal, Saaveri Verma
Singers – Pritam, Nakash Aziz, Sreerama Chandra, Amit Mishra, Jonita… pic.twitter.com/09AK5B8STG— ICC (@ICC) September 20, 2023
Also Read..
Virushka | గణేష్ చతుర్థి స్పెషల్.. పట్టుచీరలో మెరిసిపోయిన అనుష్కశర్మ
Shaheen Afridi | భార్యను రెండోసారి పెళ్లాడిన పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది