దుబాయ్: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ వేదిక బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారింది. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు బంగ్లాలో జరుగాల్సిన ఈ మెగాటోర్నీలో ఆడేందుకు సభ్యదేశాల క్రికెట్ బోర్డులు ససేమిరా అనడంతో ఐసీసీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో టీ20 ప్రపంచకప్ నిర్వహణ సాధ్యం కాదు. అక్కడ ఆడేందుకు క్రికెటర్లు, ఆయా దేశాల బోర్డులు ఆసక్తి చూపించడం లేదు. ఈ కారణంగాయూఏఈకి మార్చాల్సి వచ్చింది’ అని ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డైస్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఐసీసీ చైర్మన్ పదవి రేసులో బీసీసీఐ కార్యదర్శి జై షా ముందు వరుసలో ఉన్నాడు.