ICC U19 World Cup 2024: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్‌లో భారత కుర్రాళ్లు జోరు కొనసాగిస్తున్నారు. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ఆడుతున్న యువ భారత్.. ఆదివారం యునైటెడ్ స్టేట్స్తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించింది. బ్లూమ్‌ఫోంటెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (118 బంతుల్లో 108, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో మెరిశాడు. ముషీర్ ఖాన్ (76 బంతుల్లో 73, 6 ఫోర్లు, 1 సిక్సర్) ఫామ్ కొనసాగించాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. ఆదర్శ్ సింగ్ (25) నాలుగు ఫోర్లు బాదినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అయితే ముషీర్ ఖాన్‌తో కలిసి కులకర్ణి రెండో వికెట్‌కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదుచేశాడు. ముషీర్ ఖాన్ ఔటయ్యాక కొద్దిసేపటికే సెంచరీ పూర్తిచేసుకున్న కులకర్ణి కూడా పెవిలియన్ చేరాడు.
Innings Break!#TeamIndia post 326/5 in the first innings.
💯 from Arshin Kulkarni
73 from Musheer KhanOver to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/OAbsdAHOj5#BoysInBlue | #INDvUSA pic.twitter.com/yfxSdL8HWY
— BCCI (@BCCI) January 28, 2024
ఆఖర్లో కెప్టెన్ ఉదయ్ సహరన్ (35), ప్రియాన్షు మోలియా (27)ల, సచిన్ దాస్ (20)లు ధాటిగా ఆడి భారత్‌కు భారీ స్కోరు సాధించిపెట్టారు. కాగా పేరుకు యూఎస్ఎ టీమ్ అయినా యూఎస్ఎలో ఆడుతున్న క్రికెటర్లందరూ భారత్ సంతతి వాళ్లే కావడం గమనార్హం.