ICC Under 19 World Cup 2024: ‘ఆరే’స్తే దిగ్గజాల సరసన అండర్ – 19 కెప్టెన్.. ఫైనల్లో భారత ప్రదర్శన ఎలా ఉందంటే..!
ICC Under 19 World Cup 2024: 2024 టోర్నీలో ఓటమన్నదే లేకుండా అప్రతిహాత విజయాలతో సాగుతున్న భారత జట్టు.. వచ్చే ఆదివారం ఫైనల్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పటివరకు ఫైనల్స్‌లో ఎవరితో ఆడింది..? ఆ జట్లకు సారథులు ఎవరు..? తదితర వివరాలు,,
ICC Under 19 World Cup 2024: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్‌లో ఉదయ్ సహరన్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. తుది పోరులో ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత్‌కు ఇది తొమ్మిదో ఫైనల్ కాగా వరుసగా ఐదోవది. ఈ శతాబ్దపు తొలి ఏడాది (2000)లో ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్ నెగ్గిన భారత్.. ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తూ ఆరో టైటిల్ వేటలో ఉంది. 2024 టోర్నీలో ఓటమన్నదే లేకుండా అప్రతిహాత విజయాలతో సాగుతున్న భారత జట్టు.. వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 11) ఫైనల్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పటివరకు ఫైనల్స్‌లో ఎవరితో ఆడింది..? ఆ జట్లకు సారథులు ఎవరు..? తదితర వివరాలు ఇక్కడ చూద్దాం.
1988లో మొదలైన అండర్ – 19 వరల్డ్ కప్‌ను ఆరంభ ఎడిషన్‌లో ఆసీస్ నెగ్గింది. పలు కారణాల రీత్యా మళ్లీ పదేండ్ల తర్వాత మొదలైన ఈ టోర్నీలో భారత్ తొలిసారి 2000లో టైటిల్ గెలిచింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచి తొలి ట్రోఫీని దక్కించుకుంది. గతంతో మెన్ ఇన్ బ్లూ మిడిలార్డర్ బ్యాటర్ మహ్మద్ కైఫ్ భారత్‌కు తొలి అండర్ – 19 ట్రోఫీని అందించాడు. 2006లో శ్రీలంక వేదికగా ముగిసిన ఈ టోర్నీలో భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓడింది. 2008లో మలేషియా వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడింది. ఫైనల్లో కోహ్లీ సేన.. సౌతాఫ్రికా ఎదుట 160 పరుగుల లక్ష్యాన్ని విధించినా దానిని కాపాడుకుంది.
2010లో ఫైనల్ చేరడంలో విఫలమైన యువ భారత్.. 2012లో మాత్రం మళ్లీ కప్ కొట్టింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో టీమిండియా.. ఆసీస్‌ను చిత్తుచేసింది. 2016లో కూడా భారత జట్టు ఫైనల్ చేరినా ఈ సారి విజయం వెస్టిండీస్‌ను వరించింది.
2018లో పృథ్వీ షా సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుత భారత జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ మార్గనిర్దేశనంలో కప్ కొట్టింది. ప్రస్తుత టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు ఆ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది. 2020 ఎడిషన్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన యువ భారత్.. 2022లో మళ్లీ ట్రోఫీని సొంతం చేసుకుంది. యశ్ ధుళ్ సారథ్యంలోని కుర్రాళ్లు.. ఇంగ్లండ్‌ను ఓడించి ఐదోసారి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టోర్నీలో ఫైనల్ చేరిన ఉదయ్ సహరన్ సేన.. తుదిపోరులో ఆసీస్‌తో గెలిస్తే భారత్‌కు ఆరో ట్రోఫీ దక్కినట్టే.భారత్‌కు ఆరో టైటిల్ గెలిస్తే ఉదయ్.. కోహ్లీ, కైఫ్ వంటి దిగ్గజ సారథుల సరసన చేరతాడు.
ఇప్పటివరకూ అండర్ -19 ట్రోఫీ గెలిచిన భారత సారథులు..
– 2000 : మహ్మద్ కైఫ్
– 2008 : విరాట్ కోహ్లీ
– 2012 : ఉన్ముక్త్ చంద్
– 2018 : పృథ్వీ షా
– 2022 : యశ్ ధుల్
India’s Captain Uday Saharan in this U-19 World Cup 2024:
– 64(94).
– 75(83).
– 35(27).
– 34(57).
– 100(107).He is leading runs scorer as Captain in this U-19 World Cup – He’s leading by example! pic.twitter.com/FDreD7Jzh7
— CricketMAN2 (@ImTanujSingh) February 2, 2024
– ఈ టోర్నీలో భారత్ మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టుగా ఉండగా ఆ తర్వాత ఆస్ట్రేలియా మూడోసార్లు ట్రోఫీలు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఆదివారం ఈ రెండు జట్లే ఫైనల్లో తలపడబోతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

