ICC : ఆసియా కప్‌లో హ్యాండ్‌షేక్ వివాదాన్ని పెద్దది చేసినందుకు పాకిస్థాన్ మూల్యం చెల్లించుకోనుంది. యూఈఏ(UAE)తో మ్యాచ్ బాయ్‌కాట్ నుంచి.. టాస్ సమయంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్, కెప్టెన్ సల్మాన్ అఘా వీడియో చిత్రీకరించడం వరకూ ఆ జట్టు నిబంధనలను అధిగమిస్తూ వచ్చింది. అంతటితో ఆగకుండా భారత్‌తో మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ వ్యవహరంపై రిఫరీ తమకు క్షమాపణలు చెప్పారని పీసీబీ తమ పోస్ట్‌లో వెల్లడించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఐసీసీ పాక్ జట్టుపై చర్యలు తీసుకోనుంది.
మెగా టోర్నీలో వరుసగా నిబంధనలను ఉల్లఘించిన పాక్ తీరును నిరసిస్తూ ఐసీసీ సీఈవో సంగోజ్ గుప్తా పాక్ బోర్డుకు లేఖ రాశాడు. ఆసియా కప్‌లో హ్యాండ్‌షేక్ వ్యవహారం తదనంతర పరిణామాలపై పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ సీఈవో లేఖ రాశాడు. ‘ప్లేయర్స్, మ్యాచ్ అఫీషియల్స్ ప్రాంతం(PMOA)లో వీడియో తీయడం నిషేధమని తెలిసినా పాక్ మీడియా మేనేజర్ నయీం గిలానీ ఆ తప్పుకు పాల్పడ్డాడు. అందుకు పాక్ జట్టు దోషిగా పరిగణించాల్సి ఉంటుంది’ అని ఆ లేఖలో సంగోజ్ గుప్తా పేర్కొన్నాడు.
Who is Sanjog Gupta, the Indian who mediated with PCB in Asia Cup handshake row pic.twitter.com/DnMol7Bs6d
— Gags (@CatchOfThe40986) September 18, 2025
బుధవారం యూఏఈతో మ్యాచ్‌కు ముందు పాక్ కోరినట్టే రిఫరీతో మాట్లాడేందుకు ఐసీసీ అనుమతించింది. టాస్కు ముందు కెప్టెన్ సల్మాన్, కోచ్ మైక్ హెసన్లు రిఫరీతో మాట్లాడుతుండగా సయీం వీడియో తీశాడు.