IND vs PAK : పదిహేడో సీజన్ ఆసియా కప్‌లో భారత్(India), పాకిస్థాన్(Pakistan) మూడోసారి అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. దాయాదుల మధ్య ఇదే మొట్టమొదటి ఫైనల్ కావడంతో టైటిల్ పోరులో ఉద్రిక్తతలు నెలకొనే అవకాశముందనే వార్తలు వినిపించాయి. దాంతో సూపర్ 4 మ్యాచ్ మాదిరిగా రెచ్చగొట్టే చేష్టలు చేయకుండా.. ఆటగాళ్లు సంయమనం పాటించేలా ఐసీసీ (ICC) గట్టి చర్యలు తీసుకుంది. మైదానంలో భారత క్రికెటర్లను కవ్వించే చర్యలకు పాల్పడిన పాక్ ఆటగాళ్లు షహిబ్జద ఫర్హాన్, పేసర్ హ్యారిస్ రవుఫ్ (Harris Rauf)లకు మ్యాచ్ ఫీజులో కోత విధించింది.
భారత్, పాక్ సూపర్ – 4 మ్యాచ్‌లో ఓపెనర్ ఫర్హాన్, హ్యారిస్ రవుఫ్ల రెచ్చగొట్టే చేష్టలపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది బీసీసీఐ. అర్ధ శతకం పూర్తయ్యాక ఫర్హాన్ బ్యాట్‌తో ‘గన్ సెలబ్రేషన్’ (Gun Celebration) చేసుకోవడం.. ఫీల్డింగ్ సమయంలో రవుఫ్ విమానాలను కూల్చివేతకు సంకేతంగా సంజ్ఞలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కావని తమ కంప్లైంట్లో పేర్కొంది బీసీసీఐ. అంతేకాదు భారత ఇన్నింగ్స్ సమయంలో ఓపెనర్లు అభిషేక్, గిల్‌పై నోరు పారేసుకున్న రవుఫ్‌ను అంపైర్ మందలించడాన్ని కూడా భారత బోర్డు ప్రస్తావించింది.
🚨 HARIS RAUF – BANNED FOR 3 MATCHES 🚨
– ICC is going to impose a 3 match ban on Haris Rauf including 100% match fees from 21st sept match for bringing “War References” to the Cricket Ground & misbehaving with fans 😮
– What’s your take #INDvsPAK pic.twitter.com/TtIfmlSVSY
— Richard Kettleborough (@RichKettle07) September 26, 2025
దాంతో.. శుక్రవారం ఈ ఇద్దరూ రిఫరీ ముందు హాజరయ్యారు. ఐసీసీ నియమావళి ప్రకారం లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్టు రిఫరీ గుర్తించారు. విచారణ సమయంలో ఆరోజు మైదానంలో తాము అలా ప్రవర్తించినందుకు ‘క్షమించాలని’ రిఫరీని ఫర్హాన్, రవుఫ్ కోరారు. మొదటి పొరపాటు అయినా సరే మైదానం వేదికగా విద్వేషాలను రెచ్చొగొట్టేలా ప్రవర్తించినందుకు రవుఫ్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధం పడనుందని సమాచారం. అలానే ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో భారీగా కోత విధించడం ఖాయం.
లీగ్ దశతో పాటు సూపర్ 4 మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఆ దేశ బోర్డు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ అనంతరం పహల్గాం బాధితులకు సూర్యకు సంఘీభావం తెలియజేయడాన్ని కూడా పీసీబీ తమ కంప్లైంట్లో ప్రస్తావించింది. దాంతో.. రిఫరీ రికీ రిచర్డ్సన్ ముందు గురువారం సూర్య విచారణకు హాజరయ్యాడు. లీగ్ దశలో టాస్ సమయంలో, ఆపై పాక్‌ను ఓడించిన తర్వాత ఆ జట్టు ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వలేదో భారత సారథి రిఫరీకి వివరించాడు. సూర్య వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న రిఫరీ ఇకపై రాజకీయాలతో ముడిపడిన అంశాలపై మాట్లాడొద్దని మందలించింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ తొలిసారి ఆసియాకప్‌లో ఎదురుపడ్డాయి. సెప్టెంబర్ 21న లీగ్ దశలో దుబాయ్ వేదికగా దాయాది జట్లు తలపడ్డాయి. అయితే.. టాస్ సమయంలో పాక్ సారథి సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సూర్య. అనంతరం 7 వికెట్ల తేడాతో గెలుపొందిన తర్వాత కూడా పాక్ ఆటగాళ్ల వంక కూడా చూడకుండా డగౌట్‌కు వచ్చేశారు సూర్య, శివం దూబేలు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ విజయాన్ని పహల్గాం బాధితులకు అంకితమిచ్చాడు భారత కెప్టెన్. దాంతో.. హ్యాండ్‌షేక్ వ్యవహారంపై పీసీబీ రాద్ధాంతం చేసింది.
Bhag rauf bhag 😡 #indvspak #Harisrauf pic.twitter.com/N4jX0f9tLO
— Piyush Arora (@cric11forecast) September 21, 2025
రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చొరవ తీసుకోకపోవడం వల్లనే భారత కెప్టెన్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదని ఐసీసీకి ఫిర్యాదు చేసింది పాక్ బోర్డు. అంతేకాదు రిఫరీ ఆండీని తొలగించకుంటే టోర్నీని బాయ్‌కాట్ చేస్తామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. యూఏఈతో మ్యాచ్‌కు ఆలస్యంగా వెళ్లింది కూడా. కానీ, రిఫరీని మార్చడం కుదరదని ఐసీసీ తేల్చిచెప్పడంతో పాక్ తలొగ్గింది.