ICC : మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు అంతర్జాతీయ క్రికెట్(International Cricket)లో సమూల మార్పులకు ఐసీసీ (ICC) శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీల్లో మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా నగదు బహుమతిని అమలు చేస్తున్న ఐసీసీ ఈసారి బంతిపై దృష్టి సారించనుంది. ప్రస్తుతం టెస్టులకే పరిమితమైన పింక్ బాల్‌ను ఇక నుంచి వన్డే, టీ20ల్లోనూ ప్రవేశపెట్టేందుకు అత్యున్నత క్రికెట్ మండలి పావులు కదుపుతోంది. అన్నీ కుదరితే అహ్మదాబాద్‌లో జరగనున్న ఐసీసీ సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశముంది.
పొట్టి క్రికెట్‌కు రోజురోజుకు ఆదరణ పెరుగుతున్న ఈ రోజుల్లో టెస్టులు, వన్డేలను మరింత ఆసక్తిగా మార్చేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. ఇదివరకే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC)తో సుదీర్ఘ ఫార్మాట్‌కు జీవం పోసిన ఐసీసీ ఈసారిడ్రింక్స్ బ్రేకులోనూ హెడ్‌కోచ్‌ను అనుమతించాలనే ఉద్దేశంతో ఉంది.
⚡ Red ball and pink ball in the same Test match?
The possibility of switching to the pink ball in case of weather interruptions – if both teams agree – is being considered by the ICC.
The matter is under discussion and subject to approval in the upcoming ICC board meeting in… pic.twitter.com/J7ediw0XRh
— Cricbuzz (@cricbuzz) May 23, 2026
అలానే వన్డే, టీ20ల్లోనూ గులాబీ బంతికి ఓకే చెప్పడం, పొట్టి క్రికెట్లో ఇన్నింగ్స్ విరామం సమయాన్ని కుదించడం, ఆన్‌ఫీల్డ్ అంపైర్లకు హ్యాక్ ఐ డేటాను పరిశీలించే అవకాశమివ్వడం వంటి వాటిపై ఐసీసీ దృష్టి సారిస్తోంది. బౌలర్లు బా అహ్మదాబాద్ వేదికగా మే 30న జై షా(Jai Shah) నేతృత్వంలోని ఐసీసీ ప్రతినిధుల సమావేశంలో వీటిపై తీర్మానాలు చేసి.. ఆమోద ముద్ర వేసే అవకాశముంది.
టెస్టు క్రికెట్ ఆరంభం నుంచి ఎర్ర బంతినే ఉపయోగించేవారు. కానీ, ఈమధ్య గులాబీ బంతి టెస్టు మ్యాచులు చూశాం. ఐదు లేదా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా డే నైట్‌లో పింక్ బాల్ టెస్టు ఆడిస్తున్నారు. వన్డేలు, టీ20ల్లో ఎప్పటి నుంచో తెల్ల బంతినే వాడుతున్నారు. ఇకపై పరిస్థితులను బట్టి వన్డే, టీ20ల్లోనూ పింక్ బాల్ మ్యాచ్‌లకు ఐసీసీ అనుమతించనుంది. ఇరుజట్లు అంగీకరిస్తే డే నైట్ మ్యాచుల్లో గులాబీ బంతిని వాడేందుకు అనుకూలంగా నిబంధనలను మార్చనుంది.
Proposed ICC Rule Change: (Cricbuzz)
🔹 Head Coach to enter the Field during Drinks Break
🔹 T20I inns break reduced from 20 to 15 mins
🔹 HawkEye data to on-field umpires
🔹 Red Ball to Pink Ball if the condition permits.📷 BCCI pic.twitter.com/7IPAonj1VL
— CricketGully (@thecricketgully) May 23, 2026
టీ20ల్లో ఇన్నింగ్స్ బ్రేక్‌ను కుదించడంపై ఐసీసీ సభ్యులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం తొలుత ఆడిన జట్టు ఇన్నింగ్స్ ముగిశాక 20 నిమిషాలకు రెండో జట్టు ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఈ సమయాన్ని 15 నిమిషాలకు మార్చాలని ఐసీసీ బృందం భావిస్తోంది. ఇన్నింగ్స్ ముగిశాక ఆటగాళ్లు కలిసి.. చర్చించుకునేందుకు ఐదు నిమిషాలు పడుతుంది. మరో పది నిమిషాల తర్వాత వారు మైదానంలోకి దిగేలా నిబంధనలు మార్చాలని ఐసీసీ ప్రతినిధులు అనుకుంటున్నారు.
ప్రస్తుతం టీ20ల్లో మాత్రమే డ్రింక్స్ బ్రేకులో హెడ్‌కోచ్‌లను మైదానంలోకి అనుమతిస్తున్నారు. వన్డేలు, టెస్టుల్లో మాత్రం స్క్వాడ్‌లోని ఆటగాళ్లకు మాత్రమే డ్రింక్స్‌ను గ్రౌండ్లోకి తీసుకువస్తుంటారు. కానీ, ఇకపై ఈ రెండు ఫార్మాట్లలోనూ ఇన్నింగ్స్ మధ్యలో కోచ్‌లను మైదానంలోకి అనుమతివ్వాలని ఐసీసీ భావిస్తోంది. అయితే.. డ్రింక్స్ తెచ్చే ఆటగాళ్లు క్రికెట్ జెర్సీ వేసుకోవాలి.

ఇప్పుడు కోచ్‌లకు కూడా అదే నియమం వరిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. అలానే.. ఆన్‌ఫీల్డ్ అంపైర్లకు హ్యాక్ ఐ డేటాను పరిశీలించే అవకాశమివ్వాలని ఐసీసీ అనకుంటోంది. తద్వారా మైదానంలో బౌలర్లు ఎలాంటి అనైతికమైన పనులకు పాల్పడకుండా చూడాలని భావిస్తోంది.