దుబాయ్: ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఏకంగా 14 స్థానాలు మెరుగై 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. యూఏఈలో జరిగిన ఆసియాకప్‌లో కోహ్లీ మెరుగైన ప్రదర్శనతో తన ర్యాంకింగ్‌ను గణనీయంగా పెంచుకున్నాడు. కోహ్లీ అయిదు మ్యాచ్‌లలో 276 పరుగులు చేశాడు. ముఖ్యంగా టీ20ల్లో తొలి, అంతర్జాతీయంగా 71వ సెంచరీ నమోదుతో అతడి ర్యాంకింగ్ అనూహ్యంగా మెరుగైంది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ తన నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 14వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ జాబితాలో పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ అగ్రస్థానంలో ఉన్నాడు.