దుబాయ్: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత యువ ఓపెనర్ షఫాలీ వర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. మంగళవారం విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో షఫాలీ 726 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలువగా.. మరో ఓపెనర్ స్మృతి మందన (709) మూడో ర్యాంక్‌కు ఎగబాకింది. ఆసీస్ స్టార్ ప్లేయర్ బెత్ మూనీ (754) టాప్ ర్యాంక్‌లో ఉంది. బౌలర్ల జాబితాలో భారత్ నుంచి దీప్తి శర్మ (5వ ర్యాంక్) ఒక్కతే టాప్-5లో చోటు దక్కించుకోగా.. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆసీస్ ప్లేయర్లు దుమ్మురేపారు. బ్యాటింగ్ టాప్-10లో ఐదు ర్యాంక్‌లు దక్కించుకున్న ఆస్ట్రేలియా అమ్మాయిలు.. బౌలర్ల జాబితాలోనూ నాలుగు ర్యాంకులు సొంతం చేసుకున్నారు.