దుబాయ్: ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా రెండ్రోజుల్లోనే ముగిసిన యాషెస్ నాలుగో టెస్టుకు వేదిక అయిన మెల్బోర్న్ పిచ్‌పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తిగా బౌలర్లకు మాత్రమే సహకరించి రెండ్రోజుల్లో 36 వికెట్లు నేలకూలిన ఈ పిచ్ సంతృప్తికరంగా లేదని తీర్పునిచ్చింది. ‘మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో పిచ్ అసంతప్తికరంగా ఉంది.
ఒక్క రోజులోనే 20 వికెట్లు పడిన పిచ్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలించింది. మ్యాచ్‌లో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సంచరీ చేయలేకపోయాడు’ అని మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రౌ తీర్పునిచ్చారు. అంతేగాక పిచ్‌కు ఒక డీమెరిట్ పాయింట్‌నూ అందజేశారు. ఆరు డీమెరిట్ పాయింట్లు ఉంటే ఆ వేదికపై 12 నెలల నిషేధం పడుతుంది.