ICC : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన మహిళల వన్డే వరల్డ్ కప్ (Womens ODI World Cup) రికార్డులు నెలకొల్పింది. భారీగా ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించడమే కాదు రికార్డు స్థాయిలో వీక్షణలు సొంతం చేసుకుంది. సూపర్ హిట్టైన మెగా టోర్నీని మరింత గొప్పగా, ఆకర్షణీయంగా నిర్వహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఎనిమిది జట్లతోనే సరిపుచ్చుతున్న ఐసీసీ ఇకపై 10 జట్లను అనుమతించనుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌ను మరో దశకు తీసుకెళ్లాలనే తమ సంకల్పాన్ని నెరవేర్చుకోనుంది.
మహిళల వన్డే వరల్డ్ కప్‌ను మరింత ఘనంగా నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. అందుకే ఈ మెగా టోర్నీని ఎనిమిది జట్ల నుంచి పది టీమ్‌లకు విస్తరించనుంది. దాంతో.. మరో రెండు కొత్త జట్లతో 2019 వరల్డ్ కప్ సరికొత్తగా సాగనుంది. భారత్‌లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లను స్టేడియానికొచ్చి దాదాపు 3 లక్షల మంది అభిమానులు చూశారు. మహిళా వరల్డ్ కప్ చరిత్రలో ఇంతమంది ఫ్యాన్స్ పోటెత్తడం అనేది ఓ రికార్డు. అంతేకాదు టీవీల్లో, జియో హాట్‌స్టార్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో కోట్లాదిమంది వరల్డ్ కప్ మ్యాచ్‌లను వీక్షించారు. సో.. ఈ మెగా టోర్నీని మరోస్థాయికి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది అని ఐసీసీ మీడియా సమావేశంలో తెలిపింది. ఇంకేముంది.. పద్నాలుగో సీజన్ వన్డే వరల్డ్ కప్ పది జట్లతో సందడిగా జరుగడం ఖాయమన్నమాట.
🚨 BREAKING 🚨
The ICC has confirmed that 10 teams will participate in the next Women’s ODI World Cup — two more than in the 2025 edition. 🏏🏆#Cricket #India #CWC #Sportskeeda pic.twitter.com/SKm2OyqqHx
— Sportskeeda (@Sportskeeda) November 7, 2025
మహిళల ప్రీమియర్ లీగ్‌తో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకొనే అమ్మాయిల సంఖ్య పెరిగింది. అంతర్జాతీయంగానూ అతివల ఆటకు క్రేజ్ తేవాలనే ఉద్దేశంతో పదమూడో సీజన్ వరల్డ్ కప్ ముందు ఐసీసీ సమాన ప్రైజ్‌మనీ(Equall Prize Money)ని తెరపైకి తీసుకొచ్చింది. పురుషుల మాదిరిగానే ఇకపై మహిళా విజేతలకు సమానంగా నగదు బహుమతి ఇవ్వాలని తీర్మానించింది. ఈ నిర్ణయం కూడా మహిళా క్రికెట్ పురోగతికి బాటలు వేసిందనే చెప్పాలి. ఆడామగ సమానం అనే మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపిస్తూ.. భావి క్రికెటర్లకు భరోసానిచ్చేలా ఐసీసీ తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లు చరిత్రాత్మకం.
Countless memories 🫶
An unforgettable night ✨2nd November 2025 will forever hold the most special place in our hearts 💙#TeamIndia | #WomenInBlue | #CWC25 | #Champions | @adidas | @apollotyres pic.twitter.com/KT39iDX5Wt
— BCCI Women (@BCCIWomen) November 3, 2025
పదమూడో సీజన్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియాకు ఐసీసీ రూ.40 కోట్లు కానుకగా ఇవ్వగా.. భారత బోర్డు ఏకంగా రూ.51 కోట్ల నజరానా ప్రకటించింది. భారత స్క్వాడ్‌లోని క్రికెటర్లపై ఆయా రాష్ట్రాలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. అంతేనా భారత స్టార్ల బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగిపోయింది కూడా.