ICC : మహిళా క్రికెట్‌కు విశేష గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈమధ్యే వరల్డ్ కప్ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని భారీగా పెంచిన ఐసీసీ.. ఇప్పుడు పూర్తిగా మహిళా బృందంతోనే మెగా టోర్నీని నిర్వహించనుంది. అవును.. భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్ కప్‌లో రిఫరీల నుంచి అంపైర్ల వరకూ అందరూ మహిళలే ఉంటారని జై షా (Jai Shah) నేతృత్వంలోని ఐసీసీ స్పష్టం చేసింది. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో పూర్తిగా అతివలకే పట్టం కట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
సెప్టెంబర్ 30 నుంచి వరల్డ్ కప్ టోర్నీ జరుగనుంది. దాంతో.. గురువారం ఐసీసీ మ్యాచ్ నిర్వాహకుల జాబితాను ప్రకటించింది. 18 మంది అధికారిణులు, 14 మంది అంపైర్లు, నలుగరు రిఫరీలతో కూడిన మహిళా బృందాన్ని ఎంపిక చేసింది. 31 రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్ బాధ్యతలను వీళ్లకే అప్పగించింది ఐసీసీ. రెండేళ్ల క్రితం టీ20 వరల్డ్ కప్, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ మహిళా బృందానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు అదే ట్రెండ్‌కు వన్డే వరల్డ్ కప్‌లోనూ శ్రీకారం చుట్టింది జై షా టీమ్.
Never has an all-woman panel of umpires officiated in an ODI World Cup✊
Read more about this historic first: https://t.co/qkzUk2TMzA pic.twitter.com/kc8uDRMTEK
— ESPNcricinfo (@ESPNcricinfo) September 11, 2025
మ్యాచ్ రిఫరీలు : జీఎస్ లక్ష్మి(భారత్), మిచెల్లె పెరీరా(శ్రీలంక), ట్రుడీ అండర్సన్ (న్యూజిలాండ్), షాంద్రే ఫ్రిట్జ్ (దక్షిణాఫ్రికా).
ఆన్ ఫీల్డ్ టీవీ అంపైర్లు : వ్రిందా రథీ, గాయత్రి వేణుగోపాలన్ (భారత్), నిమలీ పెరీరా(శ్రీలంక), సూ రెడ్‌ఫెర్న్(ఇంగ్లండ్), క్లేరీ పొలొసక్, ఎలోసీ షెరిడాన్(ఆస్ట్రేలియా), కాండసే లా బొర్డే, జాక్వెలిన్ విలియమ్స్(వెస్టిండీస్), కిమ్ కాటన్(న్యూజిలాండ్), సరాహ్ దంబనేవన్ (జింబాబ్వే), షథిరా జకీర్ జెసీ(బంగ్లాదేశ్), కెరరీన్ క్లాస్టే, లారెన్ అజెంబగ్(దక్షిణాఫ్రికా).
🚨India’s squad for the Women’s World Cup
Harmanpreet Kaur (C), Smriti Mandhana (VC), Pratika Rawal, Harleen Deol, Jemimah Rodrigues, Richa Ghosh (WK), Yastika Bhatia (WK), Deepti Sharma, Sneh Rana, Amanjot Kaur, Radha Yadav, Sree Charani, Kranti Goud, Arundhati Reddy, Renuka… pic.twitter.com/AvYuZfKmJe
— Cricbuzz (@cricbuzz) August 19, 2025
‘మహిళా క్రికెట్ చరిత్రలో ఇది గర్వించదగ్గ క్షణం. మేము తీసుకున్న ఈ నిర్ణయం మిగతా ఆటలకు కూడా ప్రేరణ అవుతుందని భావిస్తున్నాం. పూర్తిగా మహిళలతో కూడిన బృందాన్ని ఎంపిక చేయడం అనేది ఒక మైలురాయి మాత్రమే కాదు లింగ సమానత్వానికి పాటుపడుతున్న ఐసీసీ నిబద్ధతకు నిదర్శనం’ అని షా ఒక ప్రకటనలో వెల్లడించాడు. పదమూడో ఎడిషన్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. దాంతో.. ఇరుదేశాలకు చెందిన అంపైర్లు, రిఫరీలకు ప్యానెల్లో చోటు దక్కింది. ఇక క్లారీ పొలోసాక్, జాక్వెలిన్ విలియమ్స్, సూ రెడ్ఫెర్న్లు మూడోసారి వరల్డ్ కప్ నిర్వహణలో భాగం కానున్నారు. సెప్టెంబర్ 30న జరుగబోయే వరల్డ్ కప్ ఆరంభ పోరులో భారత్, శ్రీలంక తలపడనున్నాయి.