T20 World Cup 2026 : పురుషుల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ మార్చాలని పట్టుపట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఆ బోర్డు ప్రతిపాదించిన ‘గ్రూప్ స్వాపింగ్‌కు’ అంగీకరించమని క్రికెట్ ఐర్లాండ్ (Cricket Ireland) స్పష్టం చేయడమే ఆలస్యం.. భారత్‌లోనే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆదేశించింది. కాదు.. కుదరదు అని బెట్టు చేస్తే కొత్త జట్టుకు అవకాశమిస్తామని బంగ్లా బోర్డును ఐసీసీ హెచ్చరించింది. అంతేకాదు ఆడుతారా? టోర్నీ నుంచి తప్పించమంటారా? ఏదో ఒకటి తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేసింది.
భద్రతా కారణాలరీత్యా భారత్‌లో ప్రపంచకప్ ఆడకుండా ఉండేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) చేస్తున్న ప్రయత్నాలు అన్నీ బెడిసి కొడుతున్నాయి. ఒక్కొక్కటిగా బంగ్లా బోర్డుకు అన్ని దారులు మూసుకుపోతున్నాయి. గ్రూప్ స్వాపింగ్ చేయాలని ఐసీసీకి విన్నవించుకున్నా నిరాశే ఎదురైంది. ఎందుకంటే.. తమను గ్రూప్ బీలోకి మార్చాలని అభ్యర్థించిన బంగ్లాదేశ్ ఆశలపై క్రికెట్ ఐర్లాండ్ (Cricket Ireland) నీళ్లు చల్లింది. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రూప్ మారబోమని, శ్రీలంకలోనే తాము ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడుతామని ఆదివారం ఐర్లాండ్ స్పష్టం చేసింది.
ICC gives ultimatum to BCB; must decide on visiting India for T20 WC by January 21: Sources#BCB #ICC #Bangladesh #India #T20WC2026 #T20WorldCup2026 pic.twitter.com/6a2qW32Q5K
— Desh Ki Sachai (@DeshKiSachai_p) January 19, 2026
ఈ నేపథ్యంలో బంగ్లా బోర్డుకు మరో అవకాశమిచ్చింది ఐసీసీ. భారత్‌లోనే ప్రపంచకప్ ఆడాలని బంగ్లాకు స్పష్టం చేసింది. అందుకు అంగీకరించకుంటే.. ఏకంగా టోర్నీ నుంచే తప్పిస్తామని ఆ దేశ బోర్డును ఐసీసీ హెచ్చరించింది. మంకుపట్టు వదిలేసి ప్రపంచకప్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడుతారా? టోర్నీ నుంచి తొలగించమంటారా? ఏదో ఒకటి తేల్చుకోండి. జనవరి 21 వరకూ మీ నిర్ణయాన్ని తెలియజేయాలని బంగ్లా బోర్డుకు స్పష్టం చేసింది ఐసీసీ. దాంతో.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న బీసీబీ సభ్యులు ‘అయ్యో.. ఇలా జరిగిందేంటీ?’ అని తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ ఐసీసీ హెచ్చరికను బంగ్లాబోర్డు బేఖాతరు చేస్తే.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం దక్కనుందని సమాచారం.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. శనివారం ఐసీసీ ప్రతినిధులు ఢాకాలో బంగ్లాదేశ్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో ఆడకూడదనే నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ఐసీసీ బృందం నచ్చజెప్పాలని చూసింది. కానీ, బంగ్లా బోర్డు మెంబర్స్ మాత్రం అందుకు అంగీకరించలేదు. శ్రీలంకలో ఆడేందుకు వీలు కల్పించేలా తమ జట్టును గ్రూప్ సీ నుంచి గ్రూప్ బీలోకి మార్చాలని ఐసీసీ సభ్యలను వారు కోరారు. పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం గ్రూప్ ‘సీ’లో ఉన్న బంగ్లాదేశ్ లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో ఆడాల్సి ఉంది. నాలుగో మ్యాచ్ ముంబైలో ఉంది. ఇక గ్రూప్ ‘బీ’లోని ఐర్లాండ్ కొలంబోలో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడనుంది.
🚨 BANGALDESH CRICKET IN BIG TROUBLE 🚨
– Scotland will replace Bangladesh in the T20 WC 2026, if they don’t travel to India 🇮🇳
– Wednesday is the deadline for BCB to submit their participation for the T20 World Cup 😲
– What’s your take 🤔pic.twitter.com/OXreqbiyly
— Richard Kettleborough (@RichKettle07) January 19, 2026